Agnipath Protests: సికింద్రాబాద్ ఆందోళనలపై అమిత్ షాతో కిషన్ రెడ్డి భేటీ

సికింద్రాబాద్ నిరసనలపై చర్చించేందుకు గానూ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు మంత్రి కిషన్ రెడ్డి. అగ్నిపథ్ స్కీంకు వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్న తీరును వివరించనున్నారు. ఇప్పటికే కేంద్ర హోంశాఖకు సికింద్రాబాద్ అగ్నిపథ్ అల్లర్లపై ప్రాధమిక నివేదిక అందినట్లు సమాచారం.

Agnipath Protests: సికింద్రాబాద్ ఆందోళనలపై అమిత్ షాతో కిషన్ రెడ్డి భేటీ

Kishan Reddy

Agnipath Protests: సికింద్రాబాద్ నిరసనలపై చర్చించేందుకు గానూ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు మంత్రి కిషన్ రెడ్డి. అగ్నిపథ్ స్కీంకు వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్న తీరును వివరించనున్నారు. ఇప్పటికే కేంద్ర హోంశాఖకు సికింద్రాబాద్ అగ్నిపథ్ అల్లర్లపై ప్రాధమిక నివేదిక అందినట్లు సమాచారం.

అమిత్ షాతో సమావేశం అనంతరం అగ్నిపథ్ అల్లర్లపై కిషన్ రెడ్డి స్పందించనున్నారు.

“అగ్నిపథ్‌” పేరుతో కేంద్ర ప్ర‌భుత్వం త్రివిధ దళాలు, సాయుధ బలగాల నియామక ప్రక్రియలో కొత్త సర్వీసు పథకాన్ని ప్రారంభించిన విష‌యంపై నిరుద్యోగులు మండిప‌డుతోన్న వేళ కేంద్ర మంత్రి అమిత్ షా మాత్రం ఆ ప‌థ‌కంపై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు. కాంట్రాక్టు ప‌ద్ధ‌తిలో నాలుగేళ్ల కాలపరిమితితో ఉండే ఈ సర్వీసుపై ఆయ‌న ట్వీట్ చేశారు. అగ్నిపథ్ పథకాన్ని పొగుడుతూ, ప్రధానికి కృతజ్ఞతలు తెలుపుతూ ప‌లు వ్యాఖ్య‌లు చేశారు.

కేంద్రం ప్రవేశపెట్టిన ‘అగ్నిపథ్’ పథకానికి వ్యతిరేకంగా నిరసనకారులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. రైల్వే స్టేషన్ రక్తసిక్తమైంది. ఆందోళనకారులపై రైల్వే పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు యువకులు మృతి చెందారు. మరికొందరు యువకులు గాయపడ్డారు.

Read Also: అగ్నిపథ్.. డిప్యూటీ సీఎం ఇంటిపై దాడి

శుక్రవారం ఉదయం భారీ ఎత్తున రైల్వే స్టేషన్‌కు చేరుకున్న ఆందోళనకారులు పలు రైళ్లకు నిప్పుపెట్టారు. ఈ ఘటనలో మూడు ఎక్స్‌ప్రెస్ రైళ్లు, ఎంఎంటీఎస్ రైళ్లు దహనమయ్యాయి. రైల్వే స్టేషన్‌కు చెందిన పలు ఆస్తులు ధ్వంసమయ్యాయి. స్టేషన్ చేరుకున్న పోలీసులు ఆందోళనకారుల్ని అదుపు చేసేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనలో ఇద్దరు యువకులు మరణించారు. మరికొందరు యువకులకు బుల్లెట్ గాయాలయ్యాయి.