Agnipath: భారత్ బంద్.. హై అలర్ట్‌లో పోలీసు బలగాలు

కేంద్రం రీసెంట్ గా ప్రవేశపెట్టిన అగ్నిపథ్ స్కీంకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే భారత్ బంద్ ప్రకటించగా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, గవర్నమెంట్ రైల్వే పోలీస్ హై అలర్ట్ లో కనిపిస్తున్నారు. అగ్నిపథ్ లో భాగంగా షార్ట్ టర్మ్ రిక్రూట్మెంట్ పాలసీని వ్యతిరేకిస్తున్నారు.

Agnipath: భారత్ బంద్.. హై అలర్ట్‌లో పోలీసు బలగాలు

Agnipath

 

 

Agnipath: కేంద్రం రీసెంట్ గా ప్రవేశపెట్టిన అగ్నిపథ్ స్కీంకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే భారత్ బంద్ ప్రకటించగా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, గవర్నమెంట్ రైల్వే పోలీస్ హై అలర్ట్ లో కనిపిస్తున్నారు. అగ్నిపథ్ లో భాగంగా షార్ట్ టర్మ్ రిక్రూట్మెంట్ పాలసీని వ్యతిరేకిస్తున్నారు.

ఆర్పీఎప్ సీనియర్ ఆఫీసర్లు అంతర్గత కమ్యూనికేషన్ సహాయంతో అన్ని యూనిట్లలో భద్రతను కట్టుదిట్టం చేయాలని పిలుపునిచ్చింది. ఆందోళనలకు పాల్పడిన వారిపి పలు ఐపీసీ సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేయాలని పోలీస్ శాఖ భావిస్తోంది. ఇదే సమయంలో ఆందోళనకారులపై మొబైల్ ఫోన్స్, వీడియో రికార్డింగ్ డివైజెస్, సీసీటీవీలు లాంటి డిజిటల్ సాక్ష్యాలు సేకరించే పనిలో ఉన్నారు.

పకడ్బందీగా దుస్తులు ధరించి పరిస్థితి చేజారకముందే అదుపులో పెట్టాలని పోలీసు అధికారులు భావిస్తున్నారు.

Read Also: అగ్నిపథ్‌పై కేంద్రం కీలక నిర్ణయాలు

ఇంటర్నెట్ సర్వీసుల ద్వారా కమ్యూనికేట్ కాకుండా బీహార్ లోని 20జిల్లాల్లో ఇంకా సేవలు నిలిపేవేసే ఉన్నాయి. పంజాబ్ లోనూ లా అండ్ ఆర్డర్ అదుపుతప్పకుండా పంజాబ్ పోలీస్ అలర్ట్ ప్రకటించారు. ఆర్మీ అధికారులతో సమన్వయమవుతూఅల్లర్లు జరగకుండా చూసేపనిలో నిమగ్నమయ్యారు.

యూపీ, జార్ఖండ్ లోనూ కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు.