Agnipath scheme : అగ్నిపథ్ పథకంలో కీలక మార్పు.. వయో పరిమితిని పెంచిన కేంద్రం
భారత త్రివిధ దళాల్లో యువతకు అవకాశం ఇచ్చేలా కేంద్రం కొత్తగా ప్రవేశ పెట్టిన 'అగ్నిపథ్' పథకంపై దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తున్న క్రమంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 'అగ్నిపథ్' పథకం వయో పరిమితిని పెంచుతు నిర్ణయం తీసుకుంది.

age limit for recruitment under agnipath scheme increased : భారత త్రివిధ దళాల్లో నాలుగేళ్ల పాటు సేవలు అందించేందుకు యువతకు అవకాశం ఇచ్చేలా కొత్తగా ప్రవేశ పెట్టిన ‘అగ్నిపథ్’ పథకంపై భారత్ దేశ వ్యాప్తంగా యువత తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. నిరసన కార్యక్రమాలతో కేంద్ర ప్రభుత్వం ఆస్తుల్ని ధ్వంసం చేస్తున్నారు. రోడ్లపై పెను విధ్వంసం సృష్టిస్తున్నారు. ఈ క్రమంలో ‘అగ్నిపథ్’ పథకం విషయంలో రక్షణశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ‘అగ్నిపథ్’ పథకం వయోపరిమితిని పెంచుతు నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా రెండో రోజు కూడా కొనసాగుతున్న నిరసన క్రమంలో ‘అగ్నిపథ్’ పథకం అభ్యర్థుల వయో పరిమితిని రెండేళ్లు పెంచింది.
తొలుత 17 ఏళ్ల నుంచి 21 ఏళ్ల యువకులు ఈ పథకానికి అర్హులని కేంద్రం ప్రకటించింది. తాజాగా గరిష్ఠ వయో పరిమితిని 23 ఏళ్లకు పెంచింది. కాకపోతే ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే పెంచిన ఈ వయో పరిమితి ఈ సంవత్సరానికి మాత్రమే చెల్లుబాటు అవుతందని స్పష్టం చేసింది. గత రెండేళ్లుగా ఆర్మీలో కొత్త నియామకాలు లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. అదే సమయంలో సాయుధ బలగాల్లోకి మున్ముందు మరింత మందిని తీసుకుంటామని..ప్రస్తుత నియామకాలను మూడు రెట్లు చేస్తామని కేంద్రం వెల్లడించింది.
ఈ ఏడాదికి గాను అగ్నిపథ్ పథకం కింద 46 వేల మంది అభ్యర్థులను ఎంపిక చేసి వారికి శిక్షణ ఇస్తారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారిని ‘అగ్నివీరులు’గా పిలుస్తారు. వీళ్లను ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీలో నాలుగేళ్ల పాటు నియమిస్తారు. అయితే, నాలుగేళ్ల తర్వాత వీరికి పెన్షన్ తో పాటు మాజీ సైనికులకు కల్పించే ఎలాంటి సౌకర్యాలు లేకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా నిరుద్యోగ యువతనుంచి తీవ్ర వ్యతిరేకలు కొనసాగుతున్నాయి.
యూపీ, బీహార్, హర్యానా, రాజస్తాన్, పంజాబ్, ఉత్తరాఖండ్ లో ఈ పథకానికి వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ ఆందోళనలు తెలంగాణకు కూడా పాకాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో నిరసనకారులు రెచ్చిపోయారు. రైలు బోగీలకు నిప్పు పెట్టారు. పెను విధ్వంసం సృష్టించారు.
#WATCH | For the last 2yrs, young people didn't get the opportunity to get inducted into Armed forces due to no recruitment process. Thus… govt decided to increase the upper age limit from 21yrs to 23yrs. It's a one-time relaxation…: Defence Minister Rajnath Singh#Agnipath pic.twitter.com/UfP5z0zakY
— ANI (@ANI) June 17, 2022
- Secunderabad Riots : సికింద్రాబాద్ విధ్వంసం కేసు.. మరో 10మంది అరెస్ట్, తమ పిల్లలు అమాయకులంటున్న తల్లిదండ్రులు
- Secunderabad Violence Pruthvi : నా కుమారుడు బోగీలకు నిప్పు పెడతాడని ఊహించలేదు- పృథ్వీ తల్లిదండ్రులు
- Subba Rao : సుబ్బారావుకి రూ.50కోట్ల నష్టం..! అందుకే ఈ దుర్మార్గం.. సికింద్రాబాద్ విధ్వంసం కేసులో షాకింగ్ విషయాలు
- Secunderabad Fire Case : సికింద్రాబాద్ విధ్వంసం కేసు.. బోగీలకు నిప్పు పెట్టింది వీళ్లే.. వెలుగులోకి షాకింగ్ వీడియోలు
- Secunderabad Violence Remand Report : సికింద్రాబాద్ అల్లర్ల కేసు.. రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు
1BJP Tarun Chugh : బంగారు తెలంగాణ సాధించే ప్రభుత్వం రాబోతోంది-తరుణ్ చుగ్
2Nadendla Manohar : ఏపీకి ఒక్క పరిశ్రమ కూడా రాలేదు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అవార్డు ఎలా వచ్చింది?
3Minister Buggana : చంద్రబాబువి పచ్చి అబద్దాలు, రేట్లు పెరగడానికి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు- ఏపీ మంత్రులు
4Malaysia Open 2022 : క్వార్టర్ ఫైనల్లో ఓడిన సింధు, ప్రణయ్
5Godfather: గాడ్‌ఫాదర్ ఎంట్రీకి టైమ్ ఫిక్స్!
6Telangana Covid Updated List : తెలంగాణలో కరోనా కల్లోలం.. కొత్తగా ఎన్ని కేసులంటే
7presidential election 2022: ఇప్పుడు ద్రౌపది ముర్ము గెలిచే ఛాన్స్ బాగా ఉంది: మమతా బెనర్జీ చురకలు
8Actress Meena: భర్త చనిపోయారు.. దయచేసి అలా చేయకండి.. అంటూ మీనా ఓపెన్ లెటర్!
9Kushbu : తెలంగాణలో రానున్నది బీజేపీ ప్రభుత్వమే : కుష్బు
10The Warrior Trailer: హై వోల్టేజ్ ట్రైలర్‌తో ఆపరేషన్ స్టార్ట్ చేసిన రామ్!
-
DRDO : దేశీయ మానవరహిత తొలి యుద్ధ విమానం.. పరీక్షించిన డీఆర్డీవో..!
-
Pavitra Lokesh: నరేశ్‌తో రిలేషన్‌పై పవిత్రా లోకేశ్ ఏమందంటే?
-
PAN-Aadhaar Link : ఆధార్-పాన్ ఇంకా లింక్ చేయలేదా? గడువు దాటింది.. డబుల్ ఫైన్ తప్పదు!
-
Congress, BJP Attack : హనుమకొండ బీజేపీ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత..కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు పరస్పర దాడి
-
Naresh: పవిత్రా లోకేష్ వివాదంపై నటుడు నరేశ్ క్లారిటీ!
-
Telangana Govt : రెసిడెన్షియల్ పాఠశాలలు జూనియర్ కళాశాలలుగా అప్ గ్రేడ్
-
WhatsApp : వాట్సాప్ 19 లక్షల భారతీయ అకౌంట్లను బ్యాన్ చేసింది.. ఎందుకంటే?
-
Bimbisara: ఓ యుద్ధం మీద పడితే ఎలా ఉంటుందో చూపిస్తానంటోన్న బింబిసారా!