ఒక్క చుక్కా వదలం : వర్షపు నీటిని ఒడిసిపడుతున్న విద్యార్థులు

  • Published By: veegamteam ,Published On : September 10, 2019 / 04:17 AM IST
ఒక్క చుక్కా వదలం : వర్షపు నీటిని ఒడిసిపడుతున్న విద్యార్థులు

చిట్టి చేతులు గట్టి పనిని తలపెట్టాయి. సమస్యలు ఉన్నాయనీ బాధపడుతూ కూర్చుంటే అది సమస్యగా మిగిలిపోతుంది. నలుగురు ఏకమైతే సమస్య హుష్ కాకి అని ఎగిరిపోతుందని నిరూపించారు గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులు. ఒక పక్క చదువు..మరోపక్క నీటి సమస్యలను అధిగమించటానికి వారు చేసిన..చేస్తున్న పని ఆదర్శంగా నిలుస్తోంది.

పుస్తకాలు..చదువులు..వీలైతే ఆటలు అది స్కూల్ వయస్సులో చేసే పని. కానీ తమకున్న నీటి సమస్యను పరిష్కరించుకోవటానికి స్కూల్ విద్యార్థులంతా వాననీటిని ఒడిసిపడుతున్నారు. ఆ నీటినే వాడుకుంటున్నారు. నీటి సమస్య అనే మాటే లేకుండా చేసుకున్నారు. నీటి సమస్య తీరిపోవటంతో విద్యార్థులంతా చక్కగా టైమ్ కు స్కూల్ కు వస్తున్నారు. చదువుపై శ్రద్ధపెట్టి టీచర్లు చెప్పే పాఠాల్ని చక్కగా వింటున్నారు.   

అది ఉత్తరప్రదేశ్ ఆగ్రాలోని  అంబేద్కర్ నగరలో ఉన్న టెడి బాగియా గవర్నమెంట్ స్కూల్. ఈ ప్రాంతంలో సుదీర్ఘం కాలం నుంచి  నీటి సమస్య ఉంది. ఆ సమస్యను అధిగమించటానికి స్కూల్ హెడ్ మాస్టర్ ఇచ్చిన ఐడియాతో స్కూల్ విద్యార్థులంతా వర్షం నీటిని ఒడిసి పట్టి పెద్ద పెద్ద డ్రమ్ముల్లో నింపుతున్నారు. ఆనీటిని స్కూల్ అవసరాలకు వినియోగించుకుంటున్నారు.అంతేకాదు ఆనీటిని విద్యార్థులు స్కూల్ నుంచి ఇంటికి కూడా పట్టుకెళ్లి..ఇంటి అవసరాలకు కూడా వాడుకుంటున్నారు. 

స్కూల్ పై కురిసిన వాన నీటిని ఓ సంపులోకి వెళ్లేలా ఏర్పాటు చేశారు. వాన నీరు పరిశుద్ధంగా ఉంటుంది. ఆ నీటిని సంపులో వెళ్లేలా చేసారు. సంపు నిండిపోతే ఆ నీటిని మోటర్ ద్వారా పెద్ద పెద్ద డ్రమ్ముల్లో నింపుతారు. అవసరమైనప్పుడు  నీటిని వినియోగించుకుంటున్నారు.ఇలా రెండు సంవత్సరాల నుంచి చేస్తున్నారు. దీంతో ఆ ప్రాంతంలో నీటి సమస్య తీరిపోయింది. 

స్కూట్ టీచర్లు..విద్యార్ధులు అంతా వర్షపు నీటిని సేకరించి రెండేళ్ల నుంచి ఆదా చేస్తున్నారు. ఈసందర్భంగా స్కూల్ ప్రిన్సిపాల్ కుసుమ్ గౌర్ మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో నీటి కొరత చాలా ఉంది. దీంతో వాటర్ ట్యాంకర్లతో నీటిని కొనుక్కునేవారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. మేమంతా కలిసి కట్టుగా వాన నీటిని సేకరించి వాటిని చక్కగా వాడుకుంటున్నామని తెలిపారు.  ఈ నీటిని పిల్లలు ఇంటికి తీసుకువెళతారని తెలిపారు. పిల్లలకు పాఠాలతో పాటు నీటిపై అవగాహన కల్పిస్తున్నామనీ..వాననీటిని ఎలా వినియోగించుకోవాలో చెబుతుంటామని తెలిపారు.