గాయపడిన మేక కోసం అంబులెన్స్‌కు ఫోన్

  • Published By: veegamteam ,Published On : October 31, 2019 / 04:21 AM IST
గాయపడిన మేక కోసం అంబులెన్స్‌కు ఫోన్

ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందని అన్నట్లుగా మారింది ఓ మేక పరిస్థితి. ఇరుగు పొరుగు వారు పడిన గొడవలో మేక గాయపడింది. దీంతో మేకను పెంచుకునే యువకుడు అంబులెన్స్ కు ఫోన్ చేసిన సందర్భం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కస్‌గంజ్ జిల్లాలోని  హరియా థెట్రా గ్రామంలో జరిగింది. 

వివరాల్లోకి వెళితే..సునీల్ హరియా థెట్రా గ్రామంవాసి. సునీల్ మినీవ్యాన్ డ్రైవరుగా ..పనిచేస్తున్నాడు. కాస్‌గంజ్-అలీఘడ్ మార్గంలో వ్యాన్ ను నడుపుతూండే సునీల్ ఇంట్లోనే ఓ మేకను పెంచుకుంటున్నాడు. ఈ క్రమంలో ఓ విషయమై పొరుగింటి వారితో గొడవ జరిగింది. అదికాస్తా ఘర్షణగా మారింది. ఈ ఘర్షణలో సునీల్ మేక గాయపడింది. మేక గాయాన్ని చూసి సునీల్ విలవిల్లాడిపోయాడు.  మేకకు చికిత్స వెంటనే చికిత్స చేయించాలనుకున్నాడు. వెంటనే 108 అంబులెన్స్ కు ఫోన్ చేశాడు. 

అంబులెన్స్ హుటాహుటిన వచ్చింది. పేషెంట్ ఎక్కడా అంటూ అంబులెన్స్ డ్రైవర్ అడిగాడు. ఇదిగో అంటూ సునీల్ తన మేకను..దానికి అయిన గాయాన్ని చూపించాడు. అది చూసి అంబులెన్స్ డ్రైవర్ షాక్ అయ్యాడు. మనుషుల కోసం ఏర్పాటు చేసిన అంబులెన్స్ ఎమర్జన్సీ సర్వీసును దుర్వినియోగం చేసాడనీ భావించిన డ్రైవర్ సునీల్ ను మందలించాడు. తరువాత దీన్ని  వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయటంతో అదికాస్తా వైరల్ గా మారింది. దీనిపై  సునీల్ కొందరు నెటిజన్లు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే..జంతుప్రేమికులు మాత్రం సునీల్ చేసిన పనిని అభినందిస్తున్నారు.