Goddess in Hijab : దుర్గా మాత‌కు బుర్ఖా?..చిత్రకారుడిపై ఆగ్రహం

దసరా పండుగ రానున్న క్రమంలో పశ్చిమ బెంగాల్ చిత్రకారుడు గీసిన చిత్రం వివాదంగా మారింది. దుర్గామాతకు బుర్ఖా వేసాడు అంటూ అర్టిస్టుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

10TV Telugu News

Goddess in Hijab : కలకత్తా అంటే ఠక్కున గుర్తుకొచ్చే రూపం దుర్గామాత. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా గణపతి నవరాత్రుల వేడుకలు జరుగుతున్నాయి. త్వరలోనే దసరా వేడుకలు రానున్నాయి. ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్ కు చెందిన సనాతన్ దిండా అనే చిత్రకారుడు గీసిన దుర్గామాత చిత్రం వివాదాస్పదంగా మారింది. చిత్రకారుడు సనాతన్ దిండా దుర్గామాత బుర్ఖా ధరించినట్లుగా ( అలాఅర్థం చేసుకున్నారు)  బొమ్మ గీసి ఆ చిత్రాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దానికి మా ఆశ్చె (అమ్మ వ‌స్తోంది) అనే క్యాప్ష‌న్‌ కూడా పెట్టాడు. దుర్గామాత అంటే హిందువులు కొలుచుకునే మాత. బుర్ఖా ఇస్లాంకు చెందినది. హిందువుల దేవతలు బుర్ఖా ఎలా వేస్తారు? అంటూ వివాదంగా మారింది.

త్వరలోనే దుర్గాపూజ‌కు స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతున్న వేళ సనాతన్ దిండా..దుర్గా మాత‌కు బుర్ఖా వేయ‌డ‌మేంట‌ని ప్ర‌శ్నిస్తున్నారు. ఈ చిత్రంపై ప‌శ్చిమ బెంగాల్ బీజేపీ మ‌హిళా మోర్చా ఉపాధ్య‌క్షురాలు కేయా ఘోష్ తీవ్రంగా మండిపడ్డారు.దుర్గా మాత హిజాబ్‌ (బుర్ఖా, లేదా మొహాన్ని కవర్ చేసే వస్త్రం)లో చూపించాడు. ఇలాంటివి చేసి కూడా అత‌డు త‌ప్పించుకోగ‌ల‌డు. ఎందుకంటే బెంగాల్‌లో ఎంతో మంది మేధావులు దీనిపై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు క‌దా అంటూ ట్వీట్ లో వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

Read more : Afghanistanculture : ‘మావస్త్రధారణ జోలికొస్తే సహించేది లేదు’..మా దుస్తులే మా గళం

ఈ విమర్శలపై చిత్రకాుడు సనాతన్ దిండా స్పందిస్తూ.. ఆ చిత్రంలో ఉన్నది దుర్గామాత అనే ఎందుకు అనుకోవాలి? నా వ‌ర‌కైతే ఆమె ఒక మ‌హిళ అని స‌నాత‌న్ చెప్పుకొచ్చారు. నేను ఎక్క‌డా బుర్ఖా లేదా హిజాబ్ అని రాయ‌లేదని స్పష్టంచేశారు. ఈ పురుషాధిక్య స‌మాజం నుంచి త‌న సౌంద‌ర్యాన్ని కాపాడుకుంటున్న మ‌హిళ‌గా చిత్రించాను. అంతేతప్ప ఆమె దుర్గామాత అని నేను చెప్పలేదు. ఆ ఉద్ధేశ్యంతో నేను బొమ్మ వేయాలేతని వివరించారు.

దీన్ని కొంతమంది కావాల‌నే వివాదం చేసి దుష్ప్ర‌చారం చేస్తున్నారని..నేటి స‌మాజంలో మ‌హిళ‌లు ఎదుర్కొంటున్న అణ‌చివేత‌ను దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రాన్ని గీసాను అని తెలిపారు. అఫ్గానిస్థాన్‌లో మ‌హిళ‌ల ప‌రిస్థితి ఎలా ఉందో మన చూస్తునే ఉన్నాం. అందువ‌ల్ల ఈ ఫొటో మ‌త‌, ప్రాంత స‌రిహ‌ద్దుల‌కు అతీత‌మైన‌ది అని స‌నాత‌న్ దిండా వివరించారు. అయినా బుర్ఖా ఉంటే త‌ప్పేంటి? అని కూడా ప్ర‌శ్నించారు.

Read more : పొట్టి దుస్తులు వేసుకో… ఫోటోలు తీస్తా… భర్త వింత కోరికతో విసుగెత్తిన భార్య….

బుర్ఖాను నేను ఓ సానుకూలాంశంగా చూస్తాను..అది ఓ మతాచారంగా చూడను. నిజానికి అది సాధికార‌త‌. జ‌ల‌గల్లాంటి పురుషుల చూపుల నుంచి స్త్రీల‌ను ముసుగు కాపాడుతుంది. అని దిండా తెలిపారు. ఇందులో ఎలాంటి త‌ప్పూ లేక‌పోయినా.. త‌న‌పై ఒత్తిడి తీసుకొచ్చి ఈ చిత్రాన్ని తీసివేసేలా చేశారని..అంతేకాకుండా నేను చేయని తప్పుకు క్షమాపణలు చెప్పేలా చేశారని చిత్రకారుడుదిండా వాపోయారు.

ఏమాట్లాడుతున్నారో కూడా తెలియని ఉన్మాదంతో వ్యాఖ్యానిస్తు..త‌న కూతురిని రేప్ చేస్తామ‌ని కూడా కొంతమంది తనను బెదిరించారని కళకు మతాలను అంటగట్టటం చాలా బాధాకరమని దిండా వాపోయారు. చ‌రిత్ర తెలియ‌ని నిర‌క్ష్య‌రాస్యులు, మ‌తం, ఆధునిక క‌ళ గురించి తెలియ‌ని వాళ్లే ఇటువంటి విషయాలను వివాదం చేసి ఆనందం పొందుతారని చిన్న విషయాలను కూడా చిలువలు పలవలుగా చేసి పబ్బం గడుపుకుంటారని తీవ్ర ఆవేదనతో దిండా మండిప‌డ్డారు.