Private Reservations: ప్రైవేటు ఉద్యోగాల్లో రిజర్వేషన్ల అంశాన్ని లేవనెత్తిన కాంగ్రెస్

ప్రైవేట్ సంస్థల్లో ఎస్సి, ఎస్టీ, ఓబీసీలకు రేజర్వేషన్లు కల్పించేలా అధికార పార్టీపై ఒత్తిడి తీసుకురావాలని కాంగ్రెస్ కమిటీ ప్రతిపాదించింది.

Private Reservations: ప్రైవేటు ఉద్యోగాల్లో రిజర్వేషన్ల అంశాన్ని లేవనెత్తిన కాంగ్రెస్

Congress

Private Reservations: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా జాతీయ కాంగ్రెస్ పార్టీ..సన్నాహాలు చేస్తుంది. అధికార బీజేపీ వైఫల్యాలను ఎత్తి చూపుతూ..ప్రజల్లో తమ పై నమ్మకం కలిగించే దిశగా కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తుంది. గత రెండు రోజులుగా రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో నిర్వహిస్తున్న ‘నవసంకల్ప్ చింతన్ శివిర్’ మేధోమధన సమావేశాల్లో కాంగ్రెస్ కోర్ కమిటీ సభ్యులు పలు అంశాలను అధిష్టానం ముందుంచారు. వాటిలో ప్రధానంగా ప్రైవేట్ సంస్థల్లో ఎస్సి, ఎస్టీ, ఓబీసీలకు రేజర్వేషన్లు కల్పించేలా అధికార పార్టీపై ఒత్తిడి తీసుకురావాలని కాంగ్రెస్ కమిటీ ప్రతిపాదించింది. శనివారం హైదరాబాద్‌లో బహిరంగ సమావేశంలో పాల్గొన్న బీజేపీ నేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, త్వరలో మైనారిటీ రిజర్వేషన్లను తగ్గిస్తామంటూ ప్రకటించిన నేపథ్యంలో, ప్రైవేటు సంస్థల్లో రిజర్వేషన్ల అమలుపై కాంగ్రెస్ కమిటీ ప్రతిపాదనలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

Other Stories: NV Ramana : మంచి తెలుగు సినిమాలు రావట్లేదు.. తెలుగు సినిమాలపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టీస్ వ్యాఖ్యలు..

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్న కాంగ్రెస్ అధిష్టానం, ఇప్పుడు ఈ ప్రైవేటు రిజర్వేషన్ల అంశాన్ని లేవనెత్తి, అధికార బీజేపీని ఇరుకున పెట్టాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది. శనివారం ఉదయ్‌పూర్‌లో జరిగిన నవసంకల్ప్ చింతన్ శివిర్’ సమావేశంలో ‘సామాజిక న్యాయం, సాధికారత కమిటీ’ ఆధ్వర్యంలో పలు అంశాలపై చర్చించి ఈ రిజర్వేషన్ల ప్రతిపాదన తెచ్చింది. గతంలో కాంగ్రెస్ హయాంలో మహిళా రిజర్వేషన్‌ బిల్లును రాజ్యసభలో ఆమోదించిన కాంగ్రెస్‌ పార్టీ ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మహిళా రిజర్వేషన్లను అమలుచేసేలా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేయాలని ఈసందర్భంగా నిర్ణయించింది.

Other Stories: Rahul Gandhi: రాహుల్ గాంధీ పాదయాత్ర చేయబోతున్నారా?

అయితే ప్రైవేటు రిజర్వేషన్లపై సాధ్యాసాధ్యాలు ఎంతవరకు ఉన్నాయనే విషయంపై మాత్రం కాంగ్రెస్ నేతలు వెల్లడించలేదు. సంస్థాగతంగానూ అటు కాంగ్రెస్‌ పార్టీలో సామాజిక న్యాయ సలహా మండలి ఏర్పాటు చేసి..ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీల విశ్వాసాన్ని పొందడానికి కావాల్సిన ప్రణాలికను సిద్ధం చేయాలనీ కమిటీ సభ్యులు అధిష్టానానికి సూచించారు. ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీలకు కేవలం 20% రిజర్వేషన్ల కల్పనకు మాత్రమే అవకాశం కల్పిస్తోంది. ఇకమీదట బూత్‌ కమిటీల నుంచి సీడబ్ల్యూసీ వరకు అన్ని స్థాయిల్లోని కమిటీల్లోనూ ఆయా వర్గాల వారికి 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కమిటీ సూచించింది. ఇక కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న సమావేశాలు, వారు లేవనెత్తుతున్న అంశాలపై అధికార పార్టీ నేతలు ఇంకా స్పందించలేదు.