PM Modi : ఒకేసారి 9 మెడికల్ కాలేజీలను ప్రారంభించిన మోదీ

మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఉత్తరప్రదేశ్ లో ప్రధాని మోదీ వరుస పర్యటనలు చేస్తున్నారు. సోమవారం ఉదయం ఉత్తరప్రదేశ్ లోని సిద్ధార్థ్​నగర్​లో 9 మెడికల్ కాలేజీలను మోదీ

10TV Telugu News

PM Modi  మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఉత్తరప్రదేశ్ లో ప్రధాని మోదీ వరుస పర్యటనలు చేస్తున్నారు. సోమవారం ఉదయం ఉత్తరప్రదేశ్ లోని సిద్ధార్థ్​నగర్​లో 9 మెడికల్ కాలేజీలను మోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉత్తర్​ప్రదేశ్​ సీఎం యోగి ఆదిత్యనాథ్​,గవర్నర్ ఆనందిబెన్ పటేల్, కేంద్ర ఆరోగ్యమంత్రి మన్​సుఖ్​ మాండవియా పాల్గొన్నారు.

సిద్ధార్థ్​నగర్​, ఈటాహ్​, హర్దోయ్​, ప్రతాప్​గఢ్​, ఫతేపుర్​, దేవరియా, మీర్జాపుర్​, జౌన్​పుర్​ జిల్లాలో రూ. 2,329కోట్ల వ్యయంతో ఈ 9 మెడికల్ కాలేజీలను నిర్మించారు. ఆరోగ్య నిపుణులు, మెడికల్ కాలేజీల పెంపు, జిల్లా హాస్పిటల్స్ లోని మౌలికవసతులను సమర్థవంతంగా ఉపయోగించేందుకు చేపట్టిన కేంద్ర పథకం ద్వారా 8 కళాశాలను ఏర్పాటు చేశారు. జౌన్​పుర్​లోని వైద్య కళాశాలను రాష్ట్ర ప్రభుత్వం సొంత వనరులతో నిర్మించుకుంది.

ఈ సందర్భంగా బహిరంగ ర్యాలీలో మోదీ మాట్లాడుతూ..గత ప్రభుత్వాలు సొంత కుటుంబాల ఖజానాలు నింపుకుని ఆదాయాన్ని పెంచుకునేందుకు తహతహలాడాయి. తమ ప్రభుత్వం మాత్రం పేదల డబ్బును పొదుపు చేసి వారికి మంచి వసతులు కల్పించే దిశగా అడుగులు వేసింది. గత ప్రభుత్వాలు పూర్వాంచల్​(యూపీలోని ఒక ప్రాంతం)ను నాశనం చేశాయి. మా ప్రభుత్వం ఇప్పుడు అక్కడి ప్రజల జీవితాల్లో ఆశలు నింపుతోంది. యూపీలో వైద్యవ్యవస్థ ఎంత దారుణంగా ఉంది అనేది పార్లమెంట్​ వేదికగా యోగి ఆదిత్యనాథ్​ బయటపెట్టారు. ఆయన కృషిని ప్రజలు మర్చిపోలేరు.

ఈ 9 మెడికల్ కాలేజీల వల్ల 2500 పడకలు అందుబాటులోకి వచ్చాయి. 5వేల మందికి ఉపాధి లభించింది. పూర్వాంచల్​ను గత ప్రభుత్వాలు వ్యాధుల పుట్టగా మార్చేశాయి. కానీ ఇప్పుడు కథ మారుతుంది. ఉత్తర భారతానికే మెడికల్​ హాబ్​గా పూర్వాంచల్​ను తీర్చిదుద్దుతామని మోదీ అన్నారు. ఏకకాలంలో 9 వైద్య కళాశాలలు ప్రారంభించడం చిన్న విషయం కాదని, వర్ధమాన, భవిష్యత్తు తరాలకు ఇవి ఎంతో ఉపయోగపడతాయని కేంద్ర ఆరోగ్యమంత్రి అన్నారు.

ALSO READ Sudan PM : సూడాన్ ప్రధానమంత్రిని అరెస్ట్ చేసిన సైన్యం