Vaccine Smart Phone : అదిరిపోయే ఆఫ‌ర్.. వ్యాక్సిన్ వేయించుకుంటే రూ.60వేలు ఖరీదైన స్మార్ట్ ఫోన్ ఫ్రీ

వ్యాక్సినేషన్ రేటుని పెంచడానికి వినూత్నంగా ఆలోచించింది. బంప‌ర్ ఆఫ‌ర్‌ ప్ర‌క‌టించింది. వ్యాక్సిన్ వేయించుకుంటే స్మార్ట్ ఫోన్ ఫ్రీగా ఇస్తామంది. డిసెంబ‌ర్ 1 నుంచి డిసెంబ‌ర్ 7

Vaccine Smart Phone : అదిరిపోయే ఆఫ‌ర్.. వ్యాక్సిన్ వేయించుకుంటే రూ.60వేలు ఖరీదైన స్మార్ట్ ఫోన్ ఫ్రీ

Vaccine Smart Phone

Vaccine Smart Phone : క‌రోనా మ‌హ‌మ్మారిని కట్టడి చేయాలంటే ఒక్కటే మార్గం. అదే వ్యాక్సిన్. అవును టీకాతోనే మహమ్మారి నుంచి సంపూర్ణ రక్షణ లభిస్తుంది. ఈ విషయాన్ని నిపుణులు ఇదివరకే చెప్పారు. ఇప్పుడు కూడా అదే చెబుతున్నారు. అర్హులైన వారందరూ కచ్చితంగా రెండు డోసుల టీకా తీసుకోవాలని, కరోనా నుంచి రక్షణ పొందాలని చెబుతున్నారు. ఈ క్రమంలో ప్రపంచంలోని అన్ని దేశాలు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను వేగంగా అమ‌లు చేస్తున్నాయి. మన దేశంలోనూ టీకాలు ఇచ్చే కార్యక్రమం పెద్ద ఎత్తున నడుస్తోంది. కాగా, ఇంకా కొంతమంది టీకాలు తీసుకునేందుకు ఆసక్తి చూపడం లేదు. అపోహలు, భయాలు, అనుమానాలతో టీకాలకు దూరంగా ఉంటున్నారు.

కాగా, వ్యాక్సినేష‌న్‌ను వేగ‌వంతం చేసేందుకు ప్రభుత్వాలు వినూత్నంగా ఆలోచిస్తున్నాయి. ఇందులో భాగంగా బంప‌ర్ ఆఫ‌ర్లు ప్ర‌క‌టిస్తున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ ప్ర‌మాదం పొంచి ఉన్న నేప‌థ్యంలో 100 శాతం వ్యాక్సినేష‌న్‌ను వేగంగా పూర్తి చేసేందుకు ప్ర‌భుత్వాలు స‌న్న‌ద్ధం అవుతున్నాయి.

SBI : ఎస్బీఐ క్రెడిట్ కార్డు యూజర్లకు షాక్, వడ్డీ రేట్లు తగ్గింపు.. అమల్లోకి కొత్త రూల్స్

గుజ‌రాత్ లోని అహ్మ‌దాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్.. వ్యాక్సినేషన్ రేటుని పెంచడానికి వినూత్నంగా ఆలోచించింది. బంప‌ర్ ఆఫ‌ర్‌ ప్ర‌క‌టించింది. వ్యాక్సిన్ వేయించుకుంటే స్మార్ట్ ఫోన్ ఫ్రీగా ఇస్తామంది. డిసెంబ‌ర్ 1 నుంచి డిసెంబ‌ర్ 7 మ‌ధ్య ఎవ‌రైతే రెండో డోసు వ్యాక్సిన్ తీసుకుంటారో వారిలో ఒక‌రిని ల‌క్కీ డ్రా తీసి గెలుపొందిన వారికి రూ.60వేల ఖరీదు చేసే స్మార్ట్ ఫోన్ ఇస్తామని ప్ర‌క‌టించింది. ఈ ఆఫర్ బాగానే పని చేసింది. జనాలు పెద్దఎత్తున వ్యాక్సిన్ వేయించుకోవ‌డానికి కేంద్రాల‌కు తరలి వ‌స్తున్నారు. కాగా, గ‌తంలో కూడా ఇలానే మురికివాడ‌ల్లో వ్యాక్సినేష‌న్ వేయించుకున్న వారికి కిలో వంట నూనెను ఫ్రీగా ఇచ్చారు.

ఇమ్యునైజేషన్ కార్యక్రమం గురించి అవగాహన కల్పించడంతో పాటు వంద శాతం వ్యాక్సిన్ కవరేజీని సాధించడం దీని లక్ష్యం అని పౌర సంఘం అధికారులు తెలిపారు. అంతేకాకుండా, లక్కీ డ్రాలో గెలిచిన 25 మందికి రూ.10వేల విలువైన అదనపు బహుమతులు ఇస్తామని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చెప్పారు.