జీన్స్ ప్యాంట్ వేసుకుంటే నలిగిపోతావ్..అంటున్న భర్త..పీఎస్ లో ఫిర్యాదుచేసిన భార్య

జీన్స్ ప్యాంట్ వేసుకుంటే నలిగిపోతావ్..అంటున్న భర్త..పీఎస్ లో ఫిర్యాదుచేసిన భార్య

Ahmedabad husband banned wife of wearing jeans : నువ్వేదంటే అదే..నీతోనే నా జీవితం, మనం పెళ్లి చేసుకుందాం..అని నమ్మించి పెళ్లి చేసుకున్న ఆ ప్రియుడు భర్త అయ్యాక తన నిజస్వరూపాన్ని బైటపెట్టాడు. మూడో పెళ్లి చేసుకున్నా..అతని బుద్ది మారలేదు. భార్యను అలా చేయొద్దు..ఇలా చేయొద్దు..ఆ బట్టలేసుకోవద్దు…జీన్స్ ప్యాంటు అసలే వేసుకోవద్దు అంటూ ఆంక్షలు పెట్టి రకాలుగా వేధింపులకు గురిచేస్తున్నాడు.అతనికి తోడు తల్లిదండ్రులు కూడా నీకు పిల్లలు పుట్టం లేదు అంటూ నానా రకాలుగా మాటలతో హింసిస్తుంటే భరించలేదని ఆమె సహనం కోల్పోయింది. పోలీసులకు ఫిర్యాదు చేసింది. మొదటి భర్తతో విడాకులు తీసుకున్నాక మంచి భర్త దొరికాడని

అహ్మదాబాద్‌లో సర్ఖేజ్ ప్రాంతంలో జుపుహారాకు చెందిన 37 ఏళ్ల మహిళ ఐటీ కంపెనీలో పనిచేసే ఓ వ్యక్తిని 2017లో రెండో వివాహం చేసుకుంది. ఆమె వివాహం చేసుకున్న ఆ వ్యక్తికి మూడో వివాహం. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాక ఆమె పెళ్లి తరువాత కూడా నేను ఉద్యోగం చేస్తాను..నాకు సామాజిక కార్యక్రమాలు చేయటం అంటే ఇష్టం తరచూ అటువంటి కార్యక్రమాలకు వెళుతుంటాను..పెళ్లి తరువాత నాకు అబ్జెక్షన్ పెట్టొదని..దీనికి ఇష్టమైతేనే పెళ్లి చేసుకుందామని చెప్పింది. దానికి సరేనని అనటంతో ఇద్దరూ పెళ్లి చేసుకునేది.

అలా తనను అర్థంచేసుకునే భర్త దొరికినందుకు చాలా సంతోషించింది. కానీ ఆ ఆనందం ఆమెకు ఎన్నో రోజులు మిగల్లేదు. పెళ్లికి ముందు ఆమె ఎల్లిస్‌బ్రిడ్జ్‌లో పనిచేసేది. పెళ్లి తరువాత తిరిగి ఉద్యోగంలో చేరేందుకు సిద్ధమైంది. అంతే అతనిలో మార్పు స్పష్టంగా కనిపించిందామెకు. ఉద్యోగానికి వెళ్లటానికి వీల్లేదన్నాడు. అదేంటీ పెళ్లికి ముందు ఒప్పుకున్నావు కదాని అడిగింది. దానికతడు నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు..నువ్వు ఉద్యోగం చేయటం నాకు ఇష్టం లేదని తెగేసి చెప్పేశాడు.

అంతేకాదు ఇకనుంచి నువ్వు జీన్స్ ప్యాంట్లు వేసుకోవటానికి వీల్లేదన్నాడు. జీన్స్ ప్యాంట్లు వేసుకుంటే నువ్వు నలిగిపోతావ్..అదినాకు ఇష్టం లేదు అందుకే ఇకనుంచి జీన్స్ ప్యాంట్లే వేసుకోవటానికి వీల్లేదని చెప్పేశాడు. అంతేకాదు బంధువుల ఇళ్లకు వెళ్లకూడదు, సామాజిక కార్యక్రమాలకు వెళ్లకూడదంటూ ఆంక్షలు విధించాడు. అక్కడితో ఊరుకోకుండా భార్యకు తన తండ్రి ఇచ్చిన ఫ్లాట్ లో ఉండొద్దు మనం వేరే ఇంటిలో ఉందాం అంటూ చెప్పుకొచ్చాడు. అదేంటి సొంత ఇల్లు ఉండగా వేరే అద్దె ఇంటిలో ఉండాల్సిన పనేంటీ అని అడిగిన భార్య నీకు అన్ని విషయాలకు సమాధానం చెప్పాల్సి గతి నాకు లేదు. నేను చెప్పినట్లుగా వినాలి అంటూ అడుగడుగునా ఆంక్షలు విధించాడు. తనకు రెండో వివాహం కావటంతో.. అన్నింటికి సర్ధుకుని మౌనంగా అన్నీ భరిస్తూ ఉండిపోయింది.

కానీ భర్త వేధింపులు చాలవన్నట్లుగా అతడి తల్లిదండ్రులు కూడా ఆమెను వేధించడం మొదలుపెట్టారు. నీకు పిల్లలు పుట్టరట కదా..కాబట్టి మేం ఏం అన్నా..ఏం చేసినా పడుండాలి అంటూ మామ వేధించటం ఎక్కువ చేశాడు. ‘‘ఇది పితృస్వామ్య దేశం..నా కొడుకు మని తన కొడుకు మాట వినాలంటూ కొడుకు ఇచ్చిన అలుసుతో కోడలిపై రెచ్చిపోయేవాడు.

అలా అన్ని విషయాల్లోను కోడలిని ఏదోరకంగా వేధిస్తుండేవారు. అలా ఓ పక్క భర్తా..మరోపక్క అత్తమామల వేధింపులు భరించలేక చివరికి ఆమె సర్ఖేజ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో గృహహింస కింద కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు.