హమ్మయ్య ట్రంప్ వెళ్లిపోయాడు.. రోడ్లపైకి తిరిగి వచ్చేసిన ఆవులు, కుక్కలు

హమ్మయ్య ట్రంప్ వెళ్లిపోయాడు.. రోడ్లపైకి తిరిగి వచ్చేసిన ఆవులు, కుక్కలు

హమ్మయ్య ట్రంప్ వెళ్లిపోయాడని ఊపిరిపీల్చుకున్న ఆవులు, కుక్కలు.. ఎప్పటిలాగే.. రోడ్లపైకి

హమ్మయ్య ట్రంప్ వెళ్లిపోయాడు.. రోడ్లపైకి తిరిగి వచ్చేసిన ఆవులు, కుక్కలు

హమ్మయ్య ట్రంప్ వెళ్లిపోయాడని ఊపిరిపీల్చుకున్న ఆవులు, కుక్కలు.. ఎప్పటిలాగే.. రోడ్లపైకి

అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ రెండు రోజుల భారత్ పర్యటన ముగించుకుని తిరిగి అమెరికి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ట్రంప్ ఇలా వెళ్లారో లేదో.. అప్పుడే.. ఆవులు, కుక్కలు తిరిగి వీధుల్లోకి, రోడ్లపైకి వచ్చేశాయి. హమ్మయ్య ట్రంప్ వెళ్లిపోయాడని ఊపిరిపీల్చుకున్న ఆవులు, కుక్కలు.. ఎప్పటిలాగే.. రోడ్లపైకి వచ్చి తమకు నచ్చిన చోట తిష్ట వేసి హాయిగా సేదతీరాయి. ఇక మనకు ఏ బాధ లేదు అంటూ రోడ్లపై రిలాక్స్ అయ్యాయి. రాజ్యం మనదే అంటే మురిసిపోయాయి. రోడ్లపై ఎక్కడపడితే అక్కడ కూర్చున్న ఆవులు.. నెమరు వేసుకుంటూ కాలక్షేపం చేశాయి.

పశువులు, కుక్కలకు స్వేచ్చ:
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాకను పురస్కరించుకుని అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఎక్కడా చెత్త, చెదారం కనిపించకుండా చేశారు. మురికి వాడలు కనిపించకుండా గోడ కూడా కట్టారు. రోడ్లు తళతళ మెరిసేలా చేశారు. ఇక రోడ్లపై తిరిగే పశువులు, కుక్కల విషయంలో ప్రత్యేక శ్రద్ద తీసుకున్నారు. మొతేరా స్టేడియం, ఎయిర్ పోర్టు పరిసరాల్లో 48 ఆవులు, బర్రెలు.. 55 వీధి కుక్కలను అధికారులు పట్టుకున్నారు. వాటిని దూరంగా తరలించారు. భారత పర్యటన ముగించుకుని ట్రంప్ అమెరికా తిరుగుపయనం అయిన వెంటనే.. అధికారులు పశువులు, కుక్కలను వదిలేశారు. దీంతో అవన్నీ మళ్లీ రోడ్లపైకి తిరిగి వచ్చేశాయి.

పశువుల యజమానులకు జరిమానా:
అయితే.. పశువుల యజమానులు నుంచి అధికారులు ఫైన్ కట్టించుకున్నారు. ఆ తర్వాతే వాటిని వదిలేశారు. ఇక కుక్కలకు స్టెరిలైజేషన్ తర్వాత ఎక్కడి నుంచి పట్టుకుని వచ్చామో.. అక్కడే వాటిని వదిలేస్తామన్నారు. పశువుల యజమానులకు మున్సిపాల్టి అధికారులు వార్నింగ్ ఇచ్చారు. పశువులను అలా రోడ్లపైకి వదిలేస్తే ఊరుకునేది లేదన్నారు. యజమానులు తమ పశువులను రోడ్లపైకి వదిలేయడంతో.. అవి ఎక్కడపడితే అక్కడ తిష్ట వేస్తున్నాయని, ట్రాఫిక్ కు, వాహనదారులకు ఇబ్బంది కలుగుతోందని చెప్పారు. మరోసారి ఇలాంటి ఘటనలు రిపీట్ కావొద్దన్నారు. కాగా ఇంకా కొన్ని పశువులు అధికారుల నిర్బంధంలోనే ఉన్నాయి. యజమానులు వచ్చి ఫైన్ కట్టి వాటిని తీసుకెళ్లొచ్చని మున్సిపాలిటీ అధికారులు చెప్పారు.

సందడి చేసిన ట్రంప్:
డొనాల్డ్ ట్రంప్ భారత్ లో రెండు రోజుల పాటు పర్యటించారు. భారత్ – అమెరికా మధ్య కీలక ఒప్పందాలు జరిగాయి. ట్రంప్ పర్యటనతో ఇరు దేశాల మధ్య బంధం మరింత బలపడిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. భారత దేశాన్ని, ప్రధాని మోడీని ప్రశంసలతో ముంచెత్తారు ట్రంప్. మోడీ గ్రేట్ లీడర్ అని ప్రశంసించిన ట్రంప్.. భారత్ గొప్ప దేశం అని కీర్తించారు. అమెరికన్ల హృదయాల్లో భారత్ కు, భారతీయులకు ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుందని చెప్పారు. భార్య, కూతురితో కలిసి భారత్ వచ్చిన ట్రంప్.. మంగళవారం(ఫిబ్రవరి 25, 2020) రాత్రి..అమెరికా తిరిగి వెళ్లిపోయారు.

×