తెలిసిందేగా : అన్నాడీఎంకే-బీజేపీ మధ్య కుదిరిన పొత్తు

తెలిసిందేగా : అన్నాడీఎంకే-బీజేపీ మధ్య కుదిరిన పొత్తు

అందరూ ఊహినంట్లుగానే తమిళనాడులో అన్నాడీఎంకే-బీజేపీల మధ్య పొత్తు ఖారారైంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో అన్నాడీఎంకేతో పొత్తు విషయమై చర్చించేందుకు మంగళవారం ఉదయం కేంద్రమంత్రి పియూష్ గోయల్ చెన్నై చేరుకొని అన్నాడీఎంకే నేతలతో చర్చించారు. చర్చల అనంతరం పొత్తుపై రెండు పార్టీల నేతల అధికార ప్రకటన చేశారు.  తమిళనాడు పుదుచ్చేరిలో బీజేపీతో కలిసి పనిచేస్తామని తమిళనాడు డిప్యూటీ సీఎం పన్నీరు సెల్వం మీడియా సమావేశంలో తెలిపారు. తమది మెగా, విజయం సాధించే కూటమని పన్నీరు సెల్వం తెలిపారు.

రాష్ట్రంలోని మొత్తం 39 లోక్ సభ స్థానాలకు గాను  పొత్తులో భాగంగా బీజేపీ 5,అన్నాడీఎంకే27, పీఎంకే7  స్థానాల్లో పోటీ చేస్తుందని తెలిపారు. తమిళనాడులో తర్వలో 21 అసెంబ్లీ స్థానాల్లో జరుగనున్న ఉప ఎన్నికల్లో అన్నాడీంకేకి బీజేపీ మద్దతిస్తుందని పియూష్ గోయల్ తెలిపారు. కేంద్రంలో మోడీ నాయకత్వంలో, రాష్ట్రంలో పళనిస్వామి,పన్నీరు సెల్వం నాయకత్వంలో ఎన్నికల్లో పోటీ చేసేందుకు తాము అంగీకరించినట్లు గోయల్ తెలిపారు. 

మీడియా సమావేశంలో కేంద్రమంత్రి పియూష్ గోయల్,సీఎం పళనిస్వామి,డిప్యూటీ సీఎం పన్నీరు సెల్వం, తమిళనాడు  బీజేపీ చీఫ్ తమిళిసాయి సౌందరరాజన్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ ఉదయమే అన్నాడీఎంకే-పీఎంకేలు కూటమిగా పోటీ చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ కూటమిలో బీజేపీ కూడా చేరింది. ప్రస్తుతతం అన్నాడీఎంకేకి 37 మంది ఎంపీలుండగా, పీఎంకేకి ఒకరు, బీజేపీకి ఒక ఎంపీ ఉన్నారు.