Tamil Nadu : అన్నాడీఎంకేకి స్టాలిన్ గండం.. ఖాళీ అవుతున్న పార్టీ

డీఎంకే తమిళనాడులో అధికారం చేపట్టి మూడు నెలలు గడుస్తుంది. ముఖ్యమంత్రిగా స్టాలిన్ మూడు నెలల్లోనే తన పనితీరుతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కరోనా కట్టడికి స్టాలిన్ తీసుకున్న చర్యలు, సంక్షేమ పథకాల అమలు, గత ప్రభుత్వ పథకాల కొనసాగింపుతో ప్రతిపక్ష పార్టీల మన్ననలు కూడా పొందారు. ఇక స్టాలిన్ పనితీరు చూసి అనేక మంది ఇతర పార్టీలకు చెందిన నేతలు డీఎంకే తీర్థం పుచుంటున్నారు.

Tamil Nadu : అన్నాడీఎంకేకి స్టాలిన్ గండం.. ఖాళీ అవుతున్న పార్టీ

Tamil Nadu

Tamil Nadu : డీఎంకే తమిళనాడులో అధికారం చేపట్టి మూడు నెలలు గడుస్తుంది. ముఖ్యమంత్రిగా స్టాలిన్ మూడు నెలల్లోనే తన పనితీరుతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కరోనా కట్టడికి స్టాలిన్ తీసుకున్న చర్యలు, సంక్షేమ పథకాల అమలు, గత ప్రభుత్వ పథకాల కొనసాగింపుతో ప్రతిపక్ష పార్టీల మన్ననలు కూడా పొందారు. ఇక స్టాలిన్ పనితీరు చూసి అనేక మంది ఇతర పార్టీలకు చెందిన నేతలు డీఎంకే తీర్థం పుచుంటున్నారు.

గత అన్నాడీఎంకే ప్రభుత్వంలో కేంద్ర మంత్రులుగా, వివిధ జిల్లాల అధ్యక్షులుగా పనిచేసిన నేతలు డీఎంకే గూటికి చేరుతున్నారు. తాజాగా అన్నాడీఎంకే మాజీ మంత్రులు తోప్పు వెంకటాచలం, పళనియప్పన్ పలు జిల్లాలకు చెందిన అన్నాడీఎంకే కీలక నేతలు డీఎంకే తీర్థం పుచ్చుకున్నారు.

తంజావూరు, ధర్మపురి, సేలం, నామక్కల్, రామనాథపురం, కన్యాకుమారీ జిల్లాలకు అన్నా డీఎంకే, ఏఎంఎంకే నేతలు చెన్నైలోని డీఎంకే ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అన్నాడీఎంకే ప్రభుత్వంలో కార్మిక సంక్షేమశాఖా మంత్రిగా పనిచేసిన నటరాజన్, అతని కుమారుడు, ఏఎంఎంకే జిల్లా కార్యదర్శి ఆనందన్, మాజీ మంత్రి శేఖర్‌ కుమారుడు పట్టుకోట్టై సెల్వం డీఎంకేలో చేరారు. ఇక కుమరి జిల్లా కార్యదర్శి సురేష్‌ రాజన్‌ సహా 73 మంది అన్నాడీఎంకే నేతలు డీఎంకే తీర్థం పుచ్చుకున్నారు.

ఈ సందర్బంగా కొందరు నేతలు అన్నాడీఎంకేపై విమర్శలు గుప్పించారు. పార్టీలో సరైన నాయకుడు లేదని, దీంతో పార్టీ క్యాడర్ అయోమయంలో పడిపోయిందని అంటున్నారు. ఇక శశికళ కూడా ఆ పార్టీని కాపాడలేదని మాజీ అన్నాడీఎంకే, తాజా డీఎంకే నేతలు అభిప్రాయపడుతున్నారు.