Bird Flu : మనుషుల నుంచి మనుషులకు సోకే ప్రమాదం తక్కువే!

H5N1 వైరస్ పక్షుల నుంచి మనుషులకు వ్యాప్తి చెందడం చాలా అరుదని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా వెల్లడించారు. అయితే..ఫౌల్ట్రీల్లో పనిచేసే వారందరూ జాగ్రత్తలు తీసుకోవాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్నారు.

Bird Flu : మనుషుల నుంచి మనుషులకు సోకే ప్రమాదం తక్కువే!

Birdflu

Bird Flu AIIMS Chief : భారతదేశంలో వైరస్ లు భయాన్ని సృష్టిస్తున్నాయి. కరోనా మొదటి వేవ్ ముగిసిపోయి..సెకండ్ వేవ్ కొనసాగుతుండగా..త్వరలోనే థర్డ్ వేవ్ ముంచుకొస్తుందని నిపుణులు హెచ్చరిస్తుండడంతో ప్రజలు హఢలిపోతున్నారు. వీటికి తోడు..ఇతర వైరస్ లు కూడా పంజా విసురుతున్నాయి. అందులో ‘బర్డ్ ఫ్లూ’ ఒకటి. భారతదేశంలో ఈ వైరస్ బారిన పడి ఒకరు చనిపోయారనే వార్త కలకలం సృష్టించింది.

Read More : Team India : వ‌న్డేల్లో టీమిండియా ప్రపంచ రికార్డ్‌

హర్యానా రాష్ట్రానికి చెందిన 11 నెలల బాలుడు బర్డ్ ఫ్లూ సోకి..ఢిల్లీ ఎయిమ్స్ లో చనిపోయారని వార్తలు వెలువడ్డాయి. దీంతో ఒక్కసారిగా ప్రజల్లో భయం నెలకొంది. బర్డ్ ఫ్లూ అనేది మనుషులకు కూడా సోకుతుందా ? అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీనిపై ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా స్పందించారు. బర్డ్ ఫ్లూ వైరస్ మనుషుల నుంచి మనుషులకు సోకే అవకాశం చాలా అరుదని వెల్లడించారు.

Read More : England And Pakistan : 22 వేల ముందు ప్రపోజ్, ఓహ్..ఆమె ఎస్ చెప్పేసింది

ఇందులో భయపడాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. H5N1 వైరస్ పక్షుల నుంచి మనుషులకు వ్యాప్తి చెందడం చాలా అరుదని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అయితే..ఫౌల్ట్రీల్లో పనిచేసే వారందరూ జాగ్రత్తలు తీసుకోవాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్నారు. ఇప్పటి వరకు మనుషుల నుంచి మనుషులకు సంక్రమించినట్లు ఆధారాలు లేవని వేవియన్స్‌లోని మెడిసిన్‌ విభాగంలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌ గా ఉన్న డాక్టర్‌ నీరజ్‌ నిశ్చల్‌ వెల్లడించారు. అధిక ఉష్టోగ్రత వద్ద ఆహారం వండిన సమయంలో వైరస్ చచ్చిపోతుందని, గతంలో ఫౌల్ట్రీలో బర్డ్ ఫ్లూ కేసులు నమోదైన సమయంలో ప్రారంభంలోనే వైరస్ వ్యాప్తిని నివారించడం జరిగిందని ఎయిమ్స్ డైరెక్టర్ తెలిపారు.