AIIMS : బ్లాక్ ఫంగస్‌పై ఏయిమ్స్ డైరెక్టర్ హెచ్చరికలు

AIIMS : బ్లాక్ ఫంగస్‌పై ఏయిమ్స్ డైరెక్టర్ హెచ్చరికలు

Aims

Black Fungus : బ్లాక్ ఫంగస్‌పై ఏయిమ్స్ డైరెక్టర్ హెచ్చరికలు జారీ చేశారు. ఫంగస్ బ్యాక్టీరియాతో ఇన్ఫెక్షన్ తో చాలా మంది చనిపోతున్నారని ఎయిమ్స్  డైరెక్టర్ రణదీప్ గులేరియా తెలిపారు. మ్యూకోర్‌మైకోసిస్ బ్లాక్ ఫంగస్ నేల, గాలి, ఆహారంలో కనిపిస్తుందన్నారు. కరోనా వచ్చాక బ్లాక్ ఫంగస్ కేసులు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారాయన.

ఎయిమ్స్ లో ఫంగస్ ఇన్ఫెక్షన్‌తో 23 మంది చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. ముక్కు, కంటి చూపు, మెదడుపై మ్యూకోర్‌మైకోసిస్ ప్రభావం చూపెడుతోందని తెలిపిన ఆయన దీనివల్ల కంటి చూపు కోల్పోతారని తెలిపారు. ఇందుకు షుగర్ ను కంట్రోల్ లో ఉంచుకోవాలని ప్రజలకు సూచించారు. అనవసరంగా స్టెరాయిడ్స్ వాడొద్దన్నారు. 2 డోసుల కరోనా టీకాలు మాస్క్ మస్ట్ అని వెల్లడించారాయన.

కొత్త వేరియంట్లపై వ్యాక్సిన్ల సామర్థ్యం ఎంతన్నది ఇంకా తెలియదని, ఏ వేరియంట్ అయినా..మాస్క్, భౌతిక దూరం రక్షిస్తాయన్నారు. వైరస్ కొత్త రూపు సంతరించుకుంటున్నందున అప్రమత్తంగా ఉండాలని మరోసారి హెచ్చరించారు. ప్రతొక్కరూ మాస్క్ లు, భౌతిక దూరం పాటించాలని గులేరియా విజ్ఞప్తి చేశారు.

Read More : Bihar: ఆ భాగాన్ని కోసేసిన మహిళ.. అక్రమ సంబంధం బయటకు రాకూడదని