కరోనా సోకుతుందని ఎయిమ్స్ డాక్టర్లు, నర్సులను అద్దె ఇళ్ల నుంచి వెళ్లగొట్టిన భూస్వాములు, ఓనర్స్

కరోనా భయంతో ఎయిమ్స్ లో పని చేస్తున్న అనేక మంది వైద్యులు, నర్సులను వారి అద్దె గృహాల నుండి భూస్వాములు బలవంతంగా గెంటివేశారు. ఎయిమ్స్ రెసిడెంట్ డాక్టర్ అసోసియేషన్ ప్రధాన మంత్రి కార్యాలయు, ఆరోగ్య మంత్రిత్వ శాఖకు విజ్ఞప్తి చేశారు. 

  • Published By: veegamteam ,Published On : March 24, 2020 / 09:13 PM IST
కరోనా సోకుతుందని ఎయిమ్స్ డాక్టర్లు, నర్సులను అద్దె ఇళ్ల నుంచి వెళ్లగొట్టిన భూస్వాములు, ఓనర్స్

కరోనా భయంతో ఎయిమ్స్ లో పని చేస్తున్న అనేక మంది వైద్యులు, నర్సులను వారి అద్దె గృహాల నుండి భూస్వాములు బలవంతంగా గెంటివేశారు. ఎయిమ్స్ రెసిడెంట్ డాక్టర్ అసోసియేషన్ ప్రధాన మంత్రి కార్యాలయు, ఆరోగ్య మంత్రిత్వ శాఖకు విజ్ఞప్తి చేశారు. 

కరోనా భయంతో ఎయిమ్స్ లో పని చేస్తున్న అనేక మంది వైద్యులు, నర్సులను వారి అద్దె గృహాల నుండి భూస్వాములు బలవంతంగా గెంటివేశారు. వీరి వల్ల కరోనావైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువగా ఉందనే భయంతో వెళ్లగొట్టారు. తమకు సహాయం చేయాలని ఎయిమ్స్ రెసిడెంట్ డాక్టర్ అసోసియేషన్ ప్రధాన మంత్రి కార్యాలయు, ఆరోగ్య మంత్రిత్వ శాఖకు విజ్ఞప్తి చేశారు. 

భూస్వాములు వివక్ష చూపుతూ వేధింపులకు గురిచేశారని, చాలా మంది వైద్యులు, ఇతర ఆరోగ్య నిపుణులను అద్దె గృహాల నుండి బహిష్కరించిన తరువాత ఎక్కడికి వెళ్ళలేక రోడ్డున పడ్డారని లేఖలో పేర్కొన్నారు. అనుమానాస్పద మరియు ధృవీకరించబడిన కరోనావైరస్ రోగులతో సన్నిహితంగా ఉన్నందున వైద్య నిపుణులు నిరంతరం వేధింపులను ఎదుర్కొంటున్నారు. కొన్ని సంఘాలు కూడా వారిని అద్దె ఇళ్లకు రానివ్వకుండా ఆపివేసినట్లు వైద్యులు తెలిపారు.

కరోనావైరస్ రోగులకు, అనుమానితులకు వైద్యం చేస్తూ, వైరస్ నివారణకు పని చేస్తున్న ప్రజారోగ్య కార్యకర్తల అంకితభావం, కృషిని సమిష్టిగా జ్ఞాపకం చేసుకోవడానికి ప్రధానమంత్రి నరేంద్రమోడీ విజ్ఞప్తి మేరకు ఆదివారం సాయంత్రం 5 గంటలకు భారతీయులు తమ బాల్కనీలు, వీధుల్లోకి వచ్చి చప్పట్లు కొట్టారు. ఇది జరిగిన రెండు రోజులకే వైద్యులను అద్దె ఇళ్ల నుంచి గెంటివేయడం హాస్యాస్పదం. కొద్ది రోజులుగా, వైద్యులు ఎదుర్కొంటున్న అనేక వేధింపులకు సంబంధించిన వార్తలు కూడా సోషల్ మీడియాలో వెలువడ్డాయి.

కోవిడ్ -19 వ్యాప్తి నేపథ్యంలో ఫ్రంట్‌లైన్ ఆరోగ్య కార్యకర్తలే కాకుండా, తమ సిబ్బంది కూడా వారు ఉంటున్న నివాస ప్రాంతాల నుండి బహిష్కరించబడిన సందర్భాలున్నాయని జాతీయ క్యారియర్ ఎయిర్ ఇండియా, దేశంలోని అతిపెద్ద దేశీయ క్యారియర్ ఇండిగో చెప్పారు. కరోనా వ్యాప్తి చెందుతున్న సమయంలో అవిశ్రాంతంగా పనిచేస్తున్న వైద్య నిపుణులను వారి అద్దె ఇళ్ల నుంచి బహిష్కరించకుండా భూస్వాములు, ఇంటి యజమానులను ప్రభుత్వం ఆదేశించాలని ఎయిమ్స్ రెసిడెంట్ డాక్టర్ అసోసియేషన్ కోరింది.

అవిశ్రాంతంగా పని చేస్తున్న వైద్య నిపుణులను అపార్ట్ మెంట్ల నుంచి గెంటివేయడాన్ని నిషేధిస్తూ భూస్వాములు, ఇంటి యజమానులకు ఉత్తర్వులు జారీ చేయాలని ప్రభుత్వాన్ని కోరింది. దేశవ్యాప్తంగా అమలులో ఉన్న లాక్డౌన్ వల్ల ఆరోగ్య నిపుణులకు ఆసుపత్రులకు రావడానికి ఇబ్బందులు వస్తున్నాయని, వారి కోసం ఏర్పాట్లు చేయాలని కోరింది.

See Also | యువ రోగికి తన రెస్పిరేటర్ దానం చేసి.. కరోనా సోకిన ఇటాలియన్ పూజారి మృతి