ఢిల్లీ అల్లర్ల బాధితులకు ఎంఐఎం విరాళం

  • Published By: chvmurthy ,Published On : March 1, 2020 / 10:56 AM IST
ఢిల్లీ అల్లర్ల బాధితులకు ఎంఐఎం విరాళం

పౌరసత్వ సవరణ చట్టానికివ్యతిరేకంగా ఢిల్లీలో జరిగిని అల్లర్లలో  బాధితులకు ఎంఐఎం ప్రజాప్రతినిధులు ఒక నెల జీతం విరాళంగా ఇస్తున్నట్లు ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. అల్లర్లలో చనిపోయిన వారంతా భారతీయులేనని ఆయన అన్నారు. ఢిల్లీలో జరిగిన అల్లర్ల గురించి…అక్కడ జరిగిన హింసాకాండ గురించిప్రధాని నరేంద్ర మోడీ ఎందుకు మాట్లాడటంలేదని ఆయన ప్రశ్నించారు.

దేశ రాజధానిలో ఇంత మారణ కాండ జరుగుతుంటే ఎన్డీఏ నాయకులు ఎందుకు మాట్లాడటంలేదని..ఇప్పటికైనా ప్రధాని బాధితకుటుంబాలను పరామర్శించాలని ఆయన అన్నారు. ఢిల్లీలో జరిగిన హింసాకాండలో 42 మంది దాకా ప్రాణాలు కోల్పోయారని, మరో 200 మంది గాయపడ్డారని వారంతా భారతీయులే కాబట్టి మోడీ ఈ విషయం స్పందించాలన్నారు.

హైదరాబాద్ లోని దారుస్సలాంలో ఎంఐఎం పార్టీ 62వ ఆవిర్భావ దినోత్సవ సభలో ఆయన మాట్లాడారు. 2002 లో  గుజరాత్ లో జరిగిన మారణహోమంతో మోడీ పాఠం నేర్చుకున్నారనుకున్నాను కానీ 2020 లో ఢిల్లీలో కూడా మారణహోమం జరిగిందని…వారి పార్టీ నాయకులు చేసిన ప్రకటన వల్లే ఇదంతా జరిగిందని  ఒవైసీ ఆరోపించారు.

2002 లో జరిగిన అల్లర్ల అనంతరం రామ్ విలాస్ పాశ్వాన్,  తన  కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు.  అకాలీదళ్ 1984 రోజులను మర్చిపోయిందా అని ఒవైసీ ప్రశ్నించారు. విద్వేష పూరిత ప్రసంగాలు చేస్తున్నానని తనపై కేసులు పెట్టినా భయపడన్ననారు. ఢిల్లీలో  శాంతి భద్రతల పరిస్ధితికి  కేంద్రమే బాధ్యత వహించాలని ఒవైసీ అన్నారు.