AIMIM’s Twitter Account : ఎంఐఎం ట్విట్టర్ ఖాతా హ్యాక్

ఆల్‌ ఇండియా మజ్లిస్‌ ఏ ఇట్టేహాదుల్‌ ముస్లిమీన్‌ (AIMIM) అధికారిక ట్విట్టర్‌ ఖాతా ఆదివారం హ్యాకింగ్ కు గురైంది.

AIMIM’s Twitter Account : ఎంఐఎం ట్విట్టర్ ఖాతా హ్యాక్

AIMIM’s Twitter Account ఆల్‌ ఇండియా మజ్లిస్‌ ఏ ఇట్టేహాదుల్‌ ముస్లిమీన్‌ (AIMIM) అధికారిక ట్విట్టర్‌ ఖాతా ఆదివారం హ్యాకింగ్ కు గురైంది. ఏఐఎంఐఎం ట్విట్టర్ ఖాతా పేరుని.. ప్రపంచ కుబేరుల్లో ఒకరైన టెస్లా సీఈవో ఎలన్‌ మస్క్‌ పేరిట మార్చారు హ్యాకర్లు. ప్రొఫైల్‌ ఫొటోను సైతం మార్చి ఎలన్‌ మస్క్‌ చిత్రాన్ని ఉంచారు. అయితే ఎలాంటి ట్వీట్లను హ్యాకర్లు పోస్ట్ చేయలేదు. కాగా, కొన్ని గంటల్లోనే ఏఐఎంఐఎం ట్విట్టర్ ఎకౌంట్ పునరుద్దరించబడింది.

నెల రోజుల వ్యవధిలో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ నేతృత్వంలోని ఏఐఎంఐఎం ట్విట్టర్‌ ఖాతా హ్యాకింగ్ కి గురవడం ఇది రెండోసారి. తొమ్మిది రోజుల క్రితం కూడా ఏఐఎంఐఎం ట్విట్టర్‌ ఎకౌంట్ హ్యాకింగ్ కు గురైందని,దీంతో తాము ట్విట్టర్ కు ఫిర్యాదు చేశామని..వెంటనే ఎకౌంట్ పునరుద్ధరించబడిందని,ఇవాళ మధ్యాహ్నాం 1గంట సమయంలో మరోసారి హ్యాకింగ్ కు గురైందని ఏఐఎంఐఎం ప్రతినిధి ఒకరు తెలిపారు. ట్విట్టర్ ఎకౌంట్ హ్యాకింగ్‌పై ఎంఐఎం సోమవారం హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేస్తుందని తెలిపారు.