Helicopter Crash : హెలికాప్టర్ ప్రమాదంలో ఆధారాలు లేకుండా మాట్లాడలేం

సేకరించిన ఎవిడెన్స్ లభించిన తర్వాతే మాట్లాడుతామని స్పష్టం చేశారు. రావత్ ఘటన పై ఏ చిన్న ఆధారాన్ని కూడా వదలమన్నారు...

Helicopter Crash : హెలికాప్టర్ ప్రమాదంలో ఆధారాలు లేకుండా మాట్లాడలేం

Air Chief

Air Chief Marshal Vivek Ram : తమిళనాడు రాష్ట్రంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంపై ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి స్పందించారు. ఈ ప్రమాదంపై ఉన్నతస్థాయి విచారణ జరుగుతోందని, ఎలాంటి ఆధారాలు లేకుండా…ఏమీ మాట్లాడలేమన్నారు. వాతావరణ తప్పిదమా ? లేక సాంకేతిక లోపమా ? అనే కోణంలో విచారణ చేయడం జరుగుతోందన్నారు. డిసెంబర్ 08వ తేదీన తమిళనాడులోని కూనూరు సమీపంలో హెలికాప్టర్ కుప్పకూలిపోయింది. ఇందులో మొత్తం 14 మంది ఉన్నారు. సీడీఎస్ బిపిన్ రావత్‌, ఆయన సతీమణి మధులికతో పాటు 13 మంది చనిపోయారు. తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ…గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ కూడా చనిపోయారు. 2021, డిసెంబర్ 18వ తేదీ శనివారం ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి మాట్లాడుతూ…

Read More : IAMC in Hyderabad : హైద‌రాబాద్‌లో దేశంలోనే తొలి ఐఏఎంసీ.. ప్రారంభించిన సీజే ఎన్వీ రమణ, సీఎం కేసీఆర్

విచారణ కమిటీలో ఎయిర్ ఫోర్స్ కు చెందిన ఉన్నతాధికారులు ఉన్నట్లు, ఆధారాలు, సేకరించిన ఎవిడెన్స్ లభించిన తర్వాతే మాట్లాడుతామని స్పష్టం చేశారు. రావత్ ఘటన పై ఏ చిన్న ఆధారాన్ని కూడా వదలమని, ప్రమాదం జరిగిన స్థలంలో దొరికిన ప్రతి ఎవిడెన్స్ ను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ప్రతి సాక్షిని విచారించాలని , దీనివల్ల వారాల సమయం పడుతోందని వెల్లడించారు. సరిహద్దులో జరుగుతున్న పరిణామాలపై ఆయన స్పందించారు. తూర్పు లడక్ ప్రాంతంలో ఎలాంటి సవాళ్లనైనా స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రస్తుతం అక్కడ స్టేటస్ కో మేయింటేయిన్ చేస్తున్నట్లు , సరిహద్దుల్లో బెదిరింపులు వస్తూనే ఉంటాయన్నారు.

Read More : Reliance Jewels : రిలయన్స్ జ్యువెల్స్.. డైమండ్ నెక్లెస్ సెట్స్ రిలీజ్

వాటికి అనుగుణంగా అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మల్టీ డైమన్షన్ వార్ లో పై దృష్టి సారించాలని చెబుతున్నామని, కేవలం యుద్ధం వైపే కాకుండా..సాంకేతికంగా, సైబర్ పరంగా ఎదురయ్యే సవాళ్ళను ధీటుగా తిప్పికొట్టేలా నైపుణ్యం సాధించాలన్నారు. డ్రోన్ దాడులను చాలెంజింగ్ గా మారాయి.. యాంటి డ్రోన్ సిస్టమ్ లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. డ్రోన్ దాడులను నుంచి వీఐపీలను రక్షించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఎయిర్ ఫోర్స్ అకాడమీ నుంచే తాను ఈ స్థాయి వరకు వచ్చినట్లు, హైదరాబాద్ తో మంచి అనుబంధం ఉందన్నారు ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి.