Air Force Officer: కత్తితో పొడిచి ఎయిర్‌ఫోర్స్ ఆఫీసర్ హత్య

ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఆఫీసర్‌ను కత్తితో పొడిచి దారుణంగా హత్య చేసిన ఘటన బీహార్ లోని తూర్పు చంపారన్ జిల్లాలో చోటు చేసుకుంది. సంగ్రామ్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన..

Air Force Officer: కత్తితో పొడిచి ఎయిర్‌ఫోర్స్ ఆఫీసర్ హత్య

Bihar Police

Air Force Officer: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఆఫీసర్‌ను కత్తితో పొడిచి దారుణంగా హత్య చేసిన ఘటన బీహార్ లోని తూర్పు చంపారన్ జిల్లాలో చోటు చేసుకుంది. సంగ్రామ్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనలో బాధితుడ్ని ఆదిత్య తివారీ అలియాస్ అలోక్ తివారీగా గుర్తించారు.

‘సంగ్రామ్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనలో ఆఫీసర్ కత్తిపోట్లు కారణంగా మృతిచెందాడు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు’ అని ఎస్పీ ఆశిష్ వెల్లడించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహానికి అంత్యక్రియలు పూర్తి చేశారు.

‘విచారణ మేరకు ప్రత్యేక దర్యాప్తు బృందాలను నియమించారు. నలుగురు వ్యక్తులని అదుపులోకి తీసుకుని ఎంక్వైరీ చేస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది’ అని ఆశిష్ అన్నారు.

ఇది కూడా చదవండి: జకోవిచ్‌కు గత నెలలో కొవిడ్ వచ్చింది కాబట్టే..

కుటుంబ సభ్యుల తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిత్య తివారీ 40వింగ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో జూనియర్ వారంట్ ఆఫీసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అమృత్ సర్ లో ఉద్యోగి అయిన ఆదిత్య ఇటీవలే స్వగ్రామానికి వచ్చాడు.