Air India: ఒక్కటి కానున్న ఎయిర్ ఇండియా-విస్తారా.. 2024కల్లా విలీనం పూర్తి

దేశంలోని టాప్ ఎయిర్ లైన్స్ సంస్థ అయిన ఎయిర్ ఇండియా-విస్తారా ఒక్కటి కానున్నాయి. 2024కల్లా వీటి విలీనం పూర్తవుతుందని టాటా కంపెనీ ప్రకటించింది. ఈ విషయాన్ని విస్తారా మాతృ సంస్థ టాటా గ్రూప్ అధికారికంగా ప్రకటించింది.

Air India: ఒక్కటి కానున్న ఎయిర్ ఇండియా-విస్తారా.. 2024కల్లా విలీనం పూర్తి

Air India: దేశంలోనే అగ్రగామి ఎయిర్ లైన్స్ సంస్థ అయిన ఎయిర్ ఇండియా, విస్తారా ఒక్కటి కానున్నాయి. ఈ విషయాన్ని విస్తారా మాతృ సంస్థ టాటా గ్రూప్ అధికారికంగా ప్రకటించింది. 2024 కల్లా ఎయిర్ ఇండియా-విస్తారా సంస్థల విలీనం పూర్తవుతుందని టాటా వెల్లడించింది. ప్రస్తుతం దేశంలోనే టాప్ ఎయిర్ లైన్స్ సంస్థల్లో ఎయిరిండియా ఒకటి.

Twitter: ట్విట్టర్ బ్లూటిక్ అకౌంట్ల రీవెరిఫికేషన్.. ఈ వారమే ప్రారంభిస్తామంటున్న ఎలన్ మస్క్

ఈ సంస్థ దేశీయ సర్వీసులతోపాటు, అంతర్జాతీయ సర్వీసుల్ని నడుపుతోంది. దేశీయ విమాన సర్వీసుల్లో రెండో స్థానంలో ఉంది. అలాగే దేశం నుంచి విదేశాలకు విమానాలు నడుపుతున్న దేశీయ సంస్థల్లో మొదటి స్థానంలో ఉంది. ప్రస్తుతం ఎయిర్ ఇండియా సంస్థకు 218 విమానాలున్నాయి. ఈ విలీనానికి సంబంధించి అన్ని అనుమతులు వచ్చాక ఈ ప్రక్రియ పూర్తవుతుందని విస్తారా సంస్థ మాతృ సంస్థ అయిన టాటా సియా తెలిపింది. ఈ ఒప్పందంలో భాగంగా టాటా సియా సంస్థ ఎయిర్ ఇండియాలో రూ.2,059 కోట్లు పెట్టుబడి పెడుతుంది. దీంతో.. ఎయిర్ ఇండియాలో సియా సంస్థకు 25.1 శాతం వాటా లభిస్తుంది. మార్చి 2024 వరకు ఈ లావాదేవీల ప్రక్రియ పూర్తవుతుందని కంపెనీ భావిస్తోంది.

YS Sharmila: షర్మిల పాదయాత్రకు తెలంగాణ హైకోర్టు అనుమతి.. వైఎస్.విజయమ్మను అడ్డుకున్న పోలీసులు

ఇప్పటికే ఎయిర్ ఇండియాలో టాటా సన్స్ సంస్థ పూర్తి వాటా కలిగి ఉంది. విస్తారాలో టాటా సన్స్ 51 శాతం వాటా కలిగి ఉండగా, సింగపూర్ ఎయిర్ లైన్స్ సంస్థ 49 శాతం వాటా కలిగి ఉంది. విలీనం పూర్తైతే ఈ రెండు సంస్థలు టాటా సన్స్ ఆధ్వర్యంలోని ఎయిర్ ఇండియా ఆధ్వర్యంలోనే పని చేస్తాయి.