Shankar Mishra: విమానంలో మహిళపై మూత్ర విజర్జన చేసిన శంకర్ మిశ్రాపై ఎయిర్ ఇండియా 4 నెలల నిషేధం

కొద్ది రోజుల క్రితం న్యూయార్క్-ఢిల్లీ విమానంలో శంకర్ మిశ్రా అనే వ్యక్తి, 70 ఏళ్ల వృద్ధురాలిపై మూత్ర విసర్జన చేశాడు. ఇంతటి దారుణానికి పాల్పడ్డ అతడిని ఆరు వారాల అనంతరం బెంగళూరులో పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఈ విషయంలో సత్వర చర్యలు తీసుకోకపోవడంతో ఎయిర్ ఇండియా తీవ్ర విమర్శలకు గురవుతోంది.

Shankar Mishra: విమానంలో మహిళపై మూత్ర విజర్జన చేసిన శంకర్ మిశ్రాపై ఎయిర్ ఇండియా 4 నెలల నిషేధం

Air India bans Shankar Mishra for 4 months for urinating on a woman in flight

Shankar Mishra: విమానంలో తోటి ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేసిన శంకర్ మిశ్రాపై ఎయిర్ ఇండియా నాలుగు నెలల నిషేధం విధించింది. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే జరిపిన అంతర్గత విచారణ నివేదికను కూడా సమర్పించినట్టు తెలుస్తోంది. అయితే ఎయిర్ ఇండియా విధించిన ఈ నిషేధాన్ని ఇతర విమానయాన సంస్థలు కూడా పాటించాల్సి ఉంటుంది. ఈ ఘటనపై ఇప్పటికే ఢిల్లీ పోలీస్ స్టేషన్‌లో వివిధ సెక్షన్ల కింద కేసు నమోదైంది. కేసు నమోదైన తర్వాత పరారైన శంకర్ మిశ్రాను ఢిల్లీ పోలీసులు ఈ నెల 7న బెంగళూరులో అరెస్ట్ చేశారు.

UP: బుర్ఖాను వ్యతిరేకించే వారిని నగ్నంగా తిప్పాలి.. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎస్పీ మాజీ ఎమ్మెల్యే

ఈ కేసులో కీలక మలుపులు కనిపించాయి. తొలుత బాధిత మహిళకు తాను పరిహారం చెల్లించానని, సమస్య ముగిసిపోయిందని పేర్కొన్నా శంకర్ మిశ్రా.. ఎనిమిది వారాల అనంతరం మాట మార్చాడు. కోర్టు విచారణ సందర్భంగా తాను ఎవరి మీద మూత్ర విసర్జన చేయలేదని, సదరు మహిళే మూత్రాన్ని ఆపుకోలేక తనంత తానే పోసుకుందని ఆరోపించాడు. మిశ్రా వ్యాఖ్యలపై బాధిత మహిళ తీవ్రస్థాయిలో స్పందించింది. చేసిన తప్పుకు పశ్చాత్తాపం చెందాల్సింది పోయి తిరిగి ఇలాంటి ఆరోపణలు చేయడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేసింది. శంకర్ మిశ్రా తనపై మూత్ర విసర్జన చేసిన విషయాన్ని బాధితురాలు టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ దృష్టికి తీసుకెళ్లడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయంలో విమాన సిబ్బంది చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారని కూడా ఆమె ఆ లేఖలో ఫిర్యాదు చేసింది.

Mallikarjun Kharge: బీజేపీది మనుస్మృతి పాలన, అంటే తాలిబన్ లాంటి పాలన.. కాంగ్రెస్ చీఫ్ ఖర్గే

కొద్ది రోజుల క్రితం న్యూయార్క్-ఢిల్లీ విమానంలో శంకర్ మిశ్రా అనే వ్యక్తి, 70 ఏళ్ల వృద్ధురాలిపై మూత్ర విసర్జన చేశాడు. ఇంతటి దారుణానికి పాల్పడ్డ అతడిని ఆరు వారాల అనంతరం బెంగళూరులో పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఈ విషయంలో సత్వర చర్యలు తీసుకోకపోవడంతో ఎయిర్ ఇండియా తీవ్ర విమర్శలకు గురవుతోంది. ఢిల్లీలో విమానం దిగగానే మిశ్రాపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. విమానాశ్రయం నుంచి అతడు దర్జాగా వెళ్లిపోయాడు. కాగా ఈ విషయమై జనవరి 4న పోలీసులకు ఎయిర్‌లైన్స్ ఫిర్యాదు చేసింది.