Air India: అధికారికంగా 69ఏళ్ల తర్వాత టాటా గ్రూప్ చేతికి ఎయిరిండియా

ఎయిరిండియా పూర్తిగా టాటాల పరం కానుండడానికి ఇవాళే ముహూర్తం. మరికొన్ని గంటల్లో అధికారికంగా మార్పిడి కార్యక్రమం పూర్తయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

Air India: అధికారికంగా 69ఏళ్ల తర్వాత టాటా గ్రూప్ చేతికి ఎయిరిండియా

Airindia

Air India: ఎయిరిండియా పూర్తిగా టాటాల పరం కానుండడానికి ఇవాళే ముహూర్తం. మరికొన్ని గంటల్లో అధికారికంగా మార్పిడి కార్యక్రమం పూర్తయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. డిసెంబర్‌ నెలాఖరుకే ఎయిరిండియాను అప్పగించాల్సి ఉండగా.. బ్యాలెన్స్ షీట్ ఫైనలైజ్‌ చేయడంలో జాప్యం జరిగింది.

ఎయిరిండియా అప్పుల ఊబిలో కూరుకుపోవడంతో కేంద్ర ప్రభుత్వం అమ్మకానికి పెట్టగా గతేడాది 18 వేల కోట్ల రూపాయలతో టాటా సంస్థకు చెందిన టాలెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ బిడ్‌ కోట్‌ చేసింది. ఆ బిడ్‌ను గతేడాది అక్టోబర్‌ 8న కేంద్రం ఆమోదించింది. ఆ తర్వాత మూడు రోజులకు అంటే అక్టోబర్‌ 11న బిడ్డింగ్‌ను ధృవీకరించింది.

టాటా గ్రూప్ ఎయిర్ ఇండియాతో కలిపి విమానయాన రంగంలో మొత్తం దాదాపు 27% మార్కెట్ వాటా చేరింది. టాటా గ్రూప్ కు విస్తారాలో 51 శాతం, ఎయిర్ ఆసియాకు 84 శాతం వాటా కలిగి ఉన్నాయి.

Read Also: బాలయ్య సినిమా కోసం బాలీవుడ్ హీరోల పోటీ!

అక్టోబర్‌ 25 ఒప్పందానికి సంబంధించి షేర్‌ పర్చేజ్ అగ్రిమెంట్‌పై కేంద్ర ప్రభుత్వం సంతకం చేసింది. టాటా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనుబంధ సంస్థ టాలేస్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి 2వేల 700 కోట్లను ప్రభుత్వం స్వీకరించి, 15,300 రుణాన్ని నిలుపుకోవడంతో ఎయిర్ ఇండియా (100% ఎయిర్ ఇండియా షేర్లు, దాని అనుబంధ సంస్థ AIXL, AISATS 50% షేర్లు) వాటాలను వ్యూహాత్మక భాగస్వామి టాటా గ్రూప్ కు బదిలీ చేశాయి.

ఒప్పందంలో భాగంగా ఎయిరిండియాతో పాటు ప్రధాన విమానాశ్రయాల్లో కార్గో, గ్రౌండ్‌ హ్యాండ్లింగ్‌ సేవలను అందించే ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌లో వంద శాతం, AISATSలో 50 శాతం టాటా గ్రూప్‌నకు దక్కింది. ఎయిరిండియాను తిరిగి చేజిక్కుంచుకునేందుకు టాటా యాజమాన్యం సుదీర్ఘకాలం నిరీక్షించింది.

ఎయిరిండియా ప్రైవేటీకరణపై ఉద్యోగ సంఘాలు ఆగ్రహాన్ని కొనసాగిస్తున్నాయి. తమకు చెల్లించాల్సిన ప్రోత్సాహకాలు, బకాయిలకు ఏ మాత్రం కోత పెట్టినా, రికవరీలకు దిగినా సహించేంది లేదని హెచ్చరిస్తూ ఇండియన్‌ పైలెట్స్‌ గిల్డ్‌ (ఐపీజీ), ఇండియన్‌ కమర్షియల్‌ పైలెట్స్‌ అసోసియేషన్‌ (ఐసీపీఏ) ఎయిరిండియా సీఎండీ విక్రందేవ్‌ దత్‌కు ఉద్యోగ సంఘాలు లేఖ రాశాయి. అవసరమైతే ఈ విషయంలో కోర్టుకెళతామంటూ హెచ్చరిస్తున్నాయి.