48 మంది పైలెట్లను తొలగించిన Air India

  • Published By: madhu ,Published On : August 15, 2020 / 11:27 AM IST
48 మంది పైలెట్లను తొలగించిన Air India

48 Pilots

ప్రభుత్వరంగ విమానయాన సంస్థ Airindia సంచలన నిర్ణయం తీసుకుంది. రాత్రికి రాత్రి 48 మంది పైలట్లను తొలగిస్తూ..ఉత్వర్వులు జారీ చేయడం కలకలం రేపుతోంది. తొలగించిన వారంతా…ఎయిర్ బస్ 320 పైలట్లు. వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఎయిర్ ఇండియా ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రజీవ బన్సాల్ ను ఇండియన్ పైలట్స్ అసోసియేషన్ (ICPA) కోరింది. ఈ మేరకు లేఖ రాసింది.



పైలట్లకు పర్సనల్ డిపార్ట్ మెంట్ నుంచి లేఖలు వచ్చాయని తెలిపింది. వీరిలో కొంతమంది విధులు నిర్వహిస్తున్నారు. 48 మంది పైలట్లు గత సంవత్సరం ఉద్యోగాలకు రాజీనామా చేశారు. ఆరు నెలల నోటీసులు ఇచ్చారు కూడ. ఆ తర్వాత..రాజీనామాను ఉపసంహరించుకున్నారు. వాస్తవానికి రాజీనామ ఉపసంహరణ లేఖలను సంస్థ అంగీకరించిందని, ఇప్పుడు చట్టాన్ని ధిక్కరించిందని, ఇది ఎలా సమర్థనీయమని ప్రశ్నించింది.



ఆర్థికంగా కొన్ని నష్టాలను ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో కరోనా వైరస్ కారణంగా..మరింత కష్టాల్లోకి నెట్టింది. సమీప భవిష్యత్ లో కోలుకుంటామని ఎయిర్ ఇండియా భావించడం లేదని సమాచారం.