Air India Sale: అప్పుల భారంతోనే ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ! ఉద్యోగుల మాటేంటి?

ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ కొలిక్కి వచ్చింది. అప్పుల్లో కూరుకుపోయిన ఎయిర్ ఇండియా సంస్థను టాటా సన్స్ దక్కించుకుంది. పెట్టుబడుల ఉపసంహరణలో కేంద్రం ఆ సంస్థలో 100శాతం వాటాలను అమ్మేసింది.

Air India Sale: అప్పుల భారంతోనే ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ! ఉద్యోగుల మాటేంటి?

Air India Sale, Tata Gets Maharaja, Air India Employees, Tata Sons

Air India Sale: ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ కొలిక్కి వచ్చింది. అప్పుల్లో కూరుకుపోయిన ఎయిర్ ఇండియా సంస్థను టాటా సన్స్ దక్కించుకుంది. పెట్టుబడుల ఉపసంహరణలో కేంద్ర ప్రభుత్వం ఎయిర్ ఇండియాలో 100 శాతం వాటాలను అమ్మేసింది. టాటా సన్స్ గ్రూపు, స్పైస్ జెట్ పోటీ పడగా.. చివరికి టాటా సన్స్ దక్కించుకుంది. స్పైస్ జెట్ కన్నా ఎక్కువ మొత్తం కోట్ వేసి ఎయిర్ ఇండియాను టాటా సన్స్ సొంతం చేసుకుంది. కేంద్రం కనీస ధర కన్నా రూ. 3 వేల కోట్లు ఎక్కువగానే బిడ్ దాఖలు అయింది. ఈ ఒప్పందంతో ఎయిర్ ఇండియాలో 100 శాతం పెట్టుబడులను కేంద్రం ఉపసంహరించుకుంది. డిసెంబరు నాటికి ఎయిర్ ఇండియాను పూర్తిగా టాటా సన్స్‌కు అప్పజెప్పనుంది. రూ. 43 వేల కోట్ల అప్పుల్లో ఉన్న ఎయిర్‌ ఇండియాను ప్రయివేట్ సంస్థలకు అప్పగించేందుకు సిద్ధమైన కేంద్రం.. వందశాతం పెట్టుబడులను ఉపసంహరించుకుని పూర్తిస్థాయిలో ప్రయివేటీకరణ ప్రక్రియ పూర్తి చేసింది.

ఎయిర్ ఇండియా 2007 నుంచి నష్టాల్లో కూరుకుపోయింది. నిర్వాహణ పరమైన లోపాలతో పాటు రాజకీయ జోక్యం వంటి కారణాలతో నష్టాల్లోకి వెళ్లింది. అప్పటి నుంచి నష్టాలే తప్ప లాభాలు రాలేదు. ప్ర‌తి రోజు 20 కోట్ల న‌ష్టాన్ని ఇప్ప‌టి వ‌ర‌కు 70 వేల కోట్ల రూపాయల న‌ష్టాన్ని మూటగట్టుకుని.. దివాళా తీసే పరిస్థితికి చేరింది. ఇప్పుడు ఎయిర్ ఇండియాను టాటా కంపెనీ దక్కించుకోవడం.. సంస్థ ఉద్యోగులకు ఊర‌ట‌నిచ్చే అంశంగా చెప్పవచ్చు. ఎయిర్ ఇండియా ప్రభుత్వం చేతుల్లోకి వెళ్లిన అనంతరం టాటా ఎయిర్ లైన్స్ ఏర్పాటు చేయాలని టాటా గ్రూప్ భావించింది. కానీ, పలు కారణాలతో వాయిదా పడింది. నష్టాల్లో ఉన్న ఎయిర్ ఇండియాను కేంద్రం అమ్మకానికి పెట్టడంతో ఆ సంస్థే కొనేందుకు ముందుకొచ్చింది. ఎక్కువ బిడ్ కోట్ చేసి సొంతం చేసుకుంది.
Swachh Bharat 2.0 : స్వచ్ఛ భారత్ 2.0 ని ప్రారంభించిన మోదీ

1932లో టాటా గ్రూప్‌ ఎయిర్‌లైన్స్‌ : 
1932లో టాటా గ్రూప్‌ టాటా ఎయిర్‌లైన్స్‌ను నెలకొల్పింది. టాటాలు సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌తో కలిసి విస్తారా ఎయిర్‌లైన్స్‌ను నడుపుతున్నారు. ఎయిర్‌ ఇండియాకు మొత్తం 43 వేల కోట్ల అప్పులు ఉన్నాయి. వీటిలో రూ. 22 వేల కోట్లు రుణాలను ఎయిర్‌ ఇండియా అసెట్‌ హోల్డింగ్‌ లిమిటెడ్‌కు బదిలీ  చేయనుంది. అటు ఢిల్లీ కన్నాట్ ప్లేస్‌లోని నాలుగు ఎకరాల భూమి, ఢిల్లీ,ముంబైతో పాటు ఇతర నగరాల్లోని హౌసింగ్ సొసైటీలు లాంటివన్నీ ప్రయివేట్ సంస్థలకు అప్పగిస్తారు. ఎయిర్‌ఇండియా ఇంజినీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్, ఎయిర్ ఇండియా ట్రాన్స్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ లాంటివి కూడా ఒప్పందంలో భాగంగా ఉంటాయి. దేశీయ విమానాశ్రయాల్లో 4వేల 400 డొమెస్టిక్ , 18వందల ఇంటర్నేషనల్‌ విమానాల ల్యాండింగ్‌, పార్కింగ్‌ స్లాట్లు, విదేశాల్లో 900 స్లాట్లు ఎయిర్ ఇండియాకు ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు టాటా సన్స్ వశం కానున్నాయి.

Punjab Politics : కాంగ్రెస్ కి బిగ్ షాక్..15 రోజుల్లో అమరీందర్ సింగ్ కొత్త పార్టీ!

ఉద్యోగుల ప్రయోజనాల బాధ్యత.. కేంద్రానిదే..!

మరోవైపు మార్గదర్శకాల ఆధారంగా ఎయిర్ ఇండియా ఉద్యోగుల ప్రయోజనాలను పూర్తిగా ప్రభుత్వం చూసుకుంటుందని పార్లమెంటులో కేంద్రం తెలిపింది. కంపెనీ యాజమాన్యంలోని ట్రస్టుల నుంచి ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO)కి బదిలీ చేయడంతో పాటు కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం (CGHS)లో ఉద్యోగులను చేర్చడం, లీవ్స్ ఎన్‌క్యాష్‌మెంట్ కారణంగా ప్రభుత్వం లిక్విడేషన్ నష్టాన్ని భరించేందుకు అంగీకరించింది. ఎయిర్‌లైన్స్ మంత్రివర్గ ప్యానెల్ చాలా డిమాండ్లకు అంగీకరించినట్లు తెలిసింది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్, పబ్లిక్ అసెట్ మేనేజ్‌మెంట్ ప్రకారం.. ఎయిర్ ఇండియా ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడతామని ప్రభుత్వం 2019 నవంబర్‌లోనే ప్రకటించింది.

ఉద్యోగాలు కోల్పోవద్దు.. మెరుగైన ప్రయోజనాలు కల్పిస్తాం :
16వేల మంది ఉద్యోగుల జీతాలు సకాలంలో చెల్లించనందున క్యారియర్‌లోని ఎయిర్‌లైన్స్ పైలట్‌లు ఎయిర్‌లైన్స్‌ వదిలివెళ్తున్నారంటూ వచ్చిన నివేదికలను కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఖండించారు. ఎయిర్ ఇండియా పైలట్లను బాగానే చూస్తున్నారని, ఎయిర్‌లైన్స్ ఆఫర్ చేసే జీతాలు బాగున్నాయని ఆయన సమర్థించారు. ప్రైవేటీకరణ జరిగే వరకు ఎయిర్ ఇండియాలో ఉద్యోగాలు కోల్పోవద్దని అన్నారు. ఉద్యోగుల హెల్త్ కవరేజ్ సహా వారికి అనుకూలమైన మెరుగైన సౌకర్యాలను కల్పిస్తామని చెప్పారు. నివేదికల ప్రకారం.. ఆరు నెలల్లోగా కంపెనీ అందించిన వసతి గృహాలను ఖాళీ చేయాలంటూ గురువారం ఎయిర్ ఇండియా ఉద్యోగులను కేంద్ర ప్రభుత్వం కోరింది. ఆగష్టులో ఎయిర్ ఇండియా స్పెసిఫిక్ ఆల్టర్నేటివ్ మెకానిజం (AISAM) సమావేశం జరిగింది. ఉద్యోగులు ఆరు నెలలు వరకు అక్కడే ఉండొచ్చునని నిర్ణయించింది.
Air India : ఎయిర్ ఇండియాను దక్కించుకున్న టాటా సన్స్