Air India : చెల్లించాల్సిన బకాయిలు రూ.16 వేల కోట్లు.. మొత్తం అప్పులు రూ.84 వేలకోట్లు

ప్రభుత్వ రంగ సంస్థ ఎయిర్‌ఇండియాను టాటా కంపెనీ తిరిగి కొనుగోలు చేసిన విషయం విదితమే. పీకల్లోతు అప్పుల్లో ఉన్న ఈ ఎయిర్‌ఇండియాను దైర్యం చేసి కొనుగోలు చేసింది టాటా

Air India : చెల్లించాల్సిన బకాయిలు రూ.16 వేల కోట్లు.. మొత్తం అప్పులు రూ.84 వేలకోట్లు

Air India

Air India : ప్రభుత్వ రంగ సంస్థ ఎయిర్‌ఇండియాను టాటా కంపెనీ తిరిగి కొనుగోలు చేసిన విషయం విదితమే. పీకల్లోతు అప్పుల్లో ఉన్న ఎయిర్‌ఇండియాను దైర్యం చేసి కొనుగోలు చేసింది టాటా.. ఇక తాజాగా ఎయిర్‌ఇండియాకు సంబందించిన పూర్తి అప్పుల వివరాలు బయటకు వచ్చాయి. ఈ సంస్థ మొత్తం అప్పులు రూ. 61,562 కోట్లు ఉండగా, ఇతర వెండర్లకు చెల్లించాల్సిన రూ.15,834 కోట్లు దీనికి అదనం.

Read More : Air India-Tata Sons : టాటాల చేతికే ఎయిరిండియా..అధికారికంగా ప్రకటించిన కేంద్రం

ఇక బాల్మేర్ లావ్రైకి కూడా పెద్దమొత్తంలో చెల్లించాల్సి ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇక టాటా సన్స్‌కు ఎయిర్‌ఇండియా విక్రయించడంతోనే ప్రభుత్వం బాధ్యత పూర్తి కాలేదని.. రోజు వారి కార్యకలాపాలను కూడా గాడిలో పెట్టాల్సి ఉంటుందని సంబంధిత అధికారులు తెలిపారు. ఈ ఏడాది మార్చి నాటికి ఎయిర్ ఇండియా అప్పులు రూ.84వేలకోట్లు ఉంది. వచ్చే డిసెంబర్ కు ఎయిర్ ఇండియా టాటా చేతుల్లోకి వెళ్తుంది. అప్పటి వరకు సంస్థపై పడే ఆర్ధిక భారాన్ని భారత ప్రభుత్వమే భరించాల్సి ఉంటుంది.

Read More : Air India Plane: బ్రిడ్జి కింద ఇరుక్కుపోయిన ఎయిరిండియా