Air India : టాటా గ్రూప్‌కి కొత్త చిక్కు.. ఎయిరిండియాలో సమ్మె సైరన్?

ఎయిరిండియాను తిరిగి స్వాధీనం చేసుకున్న టాటా గ్రూప్ కి కొత్త చిక్కు వచ్చి పడిందా? ఎయిర్ ఇండియా ఉద్యోగుల సెటిల్‌మెంట్‌, క్వార్టర్ల వ్యవహారం తలనొప్పిగా మారిందా? ఎయిర్ ఇండియా ఉద్యోగులు

10TV Telugu News

Air India : ఎయిరిండియాను తిరిగి స్వాధీనం చేసుకున్న టాటా గ్రూప్ కి కొత్త చిక్కు వచ్చి పడిందా? ఎయిర్ ఇండియా ఉద్యోగుల సెటిల్‌మెంట్‌, క్వార్టర్ల వ్యవహారం తలనొప్పిగా మారిందా? ఎయిర్ ఇండియా ఉద్యోగులు నిరవధిక సమ్మెకి దిగనున్నారా? ప్రస్తుతం నెలకొన్న పరిణామాలు టాటా గ్రూప్ కి ఇబ్బందిగా మారాయి.

మ్యాటర్ ఏంటంటే.. ఎయిరిండియాను తిరిగి స్వాధీనం చేసుకున్నామన్న సంతోషాన్ని ఎంజాయ్ చేయకముందే టాటా గ్రూప్ కి కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. ప్రభుత్వ ఆస్తుల ప్రైవేటీకరణలో భాగంగా వేల కోట్ల నష్టాల్లో ఉన్న ఎయిరిండియాను అమ్మాలని కేంద్రం నిర్ణయించగా, రూ.18వేల కోట్లు చెల్లించి ఎయిరిండియాను టాటా సన్స్‌ దక్కించుకుంది. దీంతో ఎయిరిండియా స్థిర, చర ఆస్తులన్నీ టాటా సన్స్‌ సొంతం అవుతాయి. ఇందులో బోయింగ్‌ విమానాలతో పాటు సిబ్బంది క్వార్టర్స్‌, కార్గో స్టేషన్లు ఇతర విలువైన భూములు కూడా ఉన్నాయి.

Honey : టీలో తేనె కలుపుకుంటున్నారా! ఏం జరుగుతుందో తెలుసా?

క్వార్టర్లు ఖాళీ చేయండి..
నిబంధనల ప్రకారం ప్రైవేటీకణ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆరు నెలలలోపు ప్రస్తుతం ఎయిరిండియా క్వార్టర్లలో ఉంటున్న సిబ్బంది వాటిని ఖాళీ చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు ఇప్పటికే ఎయిరిండియా కాలనీల్లో ఉంటున్న ఉద్యోగులకు నోటీసులు జారీ చేశారు. దీనిపై ఎయిరిండియా ఉద్యోగులు మండిపడుతున్నారు. ఉన్న పళంగా క్వార్టర్లు ఖాళీ చేయమనడం దారుణం అని వాపోతున్నారు.

నిరవధిక సమ్మె..?
ఎయిరిండియాలో ప్రస్తుతం 12వేల 085 మంది ఉద్యోగులు ఉన్నారు. ఇందులో పర్మినెంట్‌ ఉద్యోగులు 8వేల 084, కాంట్రాక్టు ఉద్యోగులు 4001 మంది ఉ‍న్నారు. ఇందులో చాలా మందికి ముంబై, ఢిల్లీ, కోల్‌కతా ప్రాంతాల్లో క్వార్టర్లు ఇచ్చారు. ఇప్పుడు వాటిని ఖాళీ చేస్తే తమ కుటుంబాలు రోడ్డున పడతాయని సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇళ్లు ఖాళీ చేయాలంటూ జారీ చేసిన నోటీసులు వెనక్కి తీసుకోకుంటే నవంబర్ 2 నుంచి నిరవధిక సమ్మె చేస్తామని హెచ్చరించారు.

Home Pollution : ముప్పుగా మారబోతున్న ఇంటి కాలుష్యం

ఇది అమానవీయం..
ఎయిరిండియాను ప్రైవేటీకరించిన తర్వాత సెటిల్ మెంట్‌, తమ భవిష్యత్తుకు భరోసా విషయంలో కేంద్రం నుంచి ఎటువంటి చర్యలు లేవని, కానీ ఇప్పటికిప్పుడు ఇళ్లు వదిలేసి వెళ్లాలంటూ ఆదేశాలు ఇవ్వడం అమానవీయమని ఉద్యోగులు అంటున్నారు. కనీసం తమతో చర్చలు జరిపేందుకు కూడా ఎవరూ సిద్ధంగా లేరని వాపోయారు. ఈ వ్యవహారం టాటా గ్రూప్ కి సమస్యగా మారింది. మరి, ఈ సమస్యను టాటా గ్రూప్ ఏ విధంగా పరిష్కరిస్తుందో చూడాలి.