Coonoor Helicopter: బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదం వాతావరణ తప్పిదమే: మొదటి నివేదిక

త్రివిధదళాధిపది జనరల్ బిపిన్ రావత్ సహా 13 మంది మృతికి కారణమైన హెలికాప్టర్ ప్రమాదంపై వాస్తవ నివేదిక దాదాపుగా సిద్ధమైంది

Coonoor Helicopter: బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదం వాతావరణ తప్పిదమే: మొదటి నివేదిక

Bipin

Coonoor Helicopter: త్రివిధదళాధిపది జనరల్ బిపిన్ రావత్ సహా 13 మంది మృతికి కారణమైన హెలికాప్టర్ ప్రమాదంపై వాస్తవ నివేదిక దాదాపుగా సిద్ధమైంది. ఎయిర్ మార్షల్ మానవేంద్ర సింగ్ నేతృత్వంలోని త్రీ-సేవ కమిటీ తుది నివేదికను సిద్ధం చేసి.. వచ్చే వారం వైమానికదళ ప్రధాన కార్యాలయానికి అందించనున్నారు. కాగా వాతావరణ పొగమంచు కారణంగా పైలట్ ముందున్న అడ్డంకులను గుర్తించలేక(అంచనా) పోవడంతోనే ఈ ప్రమాదం సంభవించినట్లు నివేదికలో పేర్కొన్నట్లు దర్యాప్తుకు సంబంధమున్న ఒక అధికారి ద్వారా జాతీయ మీడియాకు సమాచారం అందింది.

Also read: National Politics: రూ.12 కోట్ల విలువైన కారు వాడుతున్న మోదీ ఫకీర్ ఎలా అవుతాడు: శివసేన ఎంపీ

జంట ఇంజిన్లు కలిగిన Mi-17 V5 హెలికాప్టర్ లో సాంకేతిక లోపంతోనే ఈప్రమాదం జరిగి ఉంటుందన్న వాదనలను ఎయిర్ మార్షల్ మానవేంద్రసింగ్ కొట్టిపారేశారు. ప్రమాదానికి గల అన్ని కారణాలపై ఒకటికి రెండు సార్లు విశ్లేషించుకున్న తరువాతనే నివేదిక సిద్ధం చేసినట్లు వారు పేర్కొన్నారు. సాంకేతిక పరిభాషలో చెప్పాలంటే.. C-FITగా పిలిచే ఇటువంటి ప్రమాదంలో.. హెలికాప్టర్.. పైలట్ నియంత్రణలోనే ఉన్నప్పటికీ.. ఎదురుగా ఉన్న లక్ష్యం(object) సరిగాలేకపోవడంతో.. ప్రమాదాల భారిన పడే అవకాశం ఉంది. అతి తీవ్ర వాతావరణ పరిస్థితుల్లో ఒక్కోసారి పైలట్ అంచనాలు తప్పి.. ఎదురుగానున్న ఏదైనా చెట్టునుగాని, కొండనుగాని, ఢీకొట్టి ప్రమాదంలో చిక్కుకుంటారు. అటువంటి పరిస్థితినే.. ఆరోజు పైలట్ ఎదుర్కొని ఉండి ఉండొచ్చని నివేదికలో పేర్కొన్నారు.

Also read: Ramgopal Varma: ప్రేక్షకులు థియేటర్లకు రాకపోతే ప్రభుత్వమే బాధ్యత వహించాలి: ఆర్జీవీ

త్రివిధదళాధిపతి జనరల్ బిపిన్ రావత్, ఆయన సతీమణి సహా మరో 12 మంది సైనికులు, పౌరులు.. డిసెంబర్ 8 2021లో తమిళనాడులోని సూళూర్ ఎయిర్ బేస్ నుంచి Mi-17 V5 హెలికాప్టర్ లో వెల్లింగ్టన్ హెలిపాడ్ వద్దకు బయలుదేరారు. వీరు బయలుదేరిన నిముషాల వ్యవధిలోనే కూనూర్ వద్ద హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది

Aslo read: Singareni Accident: భూపాలపల్లి సింగరేణి కేటీకే-5వ ఇంక్లైన్ లో తప్పిన ముప్పు