దీపావళి ముగిసింది…తీవ్ర వాయుకాలుష్యం వచ్చింది

  • Published By: venkaiahnaidu ,Published On : October 28, 2019 / 02:03 AM IST
దీపావళి ముగిసింది…తీవ్ర వాయుకాలుష్యం వచ్చింది

దీపావళి తర్వాత దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో విపరీతమైన వాయు కాలుష్యం నెలకొంది. ఫైర్ క్రాకర్స్,నల్లమందు టపాసులు వంటి పేలుడు ఐటమ్స్ కారణంగా దేశ రాజధాని ఢిల్లీ,నోయిడా సిటీల్లోవాయు కాలుష్యం అత్యధిక స్థాయికి చేరుకుంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(AQI)ప్రకారం…మొత్తంగా ఢిల్లీలో వాయు కాలుష్యం స్థాయి 306గా నమోదవగా,నోయిడాలో356గా నమోదయింది.

రాజధానిలోని 37 ఏక్యూఐ స్టేషన్లలోని 29 స్టేషన్లలో వాయుకాలుష్యం అత్యంత అధికంగా నమోదయ్యింది. ఢిల్లీకి ఆనుకుని ఉన్న ఫరీదాబాద్‌లో ఏక్యూఐ 318, గజియాబాద్‌లో 397గా నమోదయ్యింది. గత ఏడాది దీపావళి సమయంలో ఏక్యూఐ 600 మార్కును దాటింది. 2017లో ఏక్యూఐ 367గా నమోదయ్యింది. కాలుష్య నియంత్రణ చర్యగా గతరాత్రి తూర్పు ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ (EDMC)…లక్ష్మీ నగర్ ప్రాంతంలో గతరాత్రి ట్యాంకర్లతో రోడ్లపై నీటిని చల్లింది. కాలుష్య నియంత్రణ కోసం ఢిల్లీలో వచ్చే నెల4నుంచి మరోసారి సరి-బేసి విధానాన్ని కేజ్రీవాల్ సర్కార్ ప్రవేశపెడుతున్న విషయం తెలిసిందే.

మరోవైపు పంజాబ్,హర్యానాలో రైతులు పంటలు తగలబెట్టడం కూడా ఢిల్లీ తీవ్ర వాయుకాలుష్యానికి కారణంగా మారింది. ఈ ఏడాది పంటల తగలబెట్టుట ఎక్కువ అయిందని పంజాబ్ రిమోట్ సెన్సింగ్(PRSC)తెలిపింది.