పాకిస్తాన్ జెండాతో.. సరిహద్దుల్లో విమానం ఆకారంలో బెలూన్..

పాకిస్తాన్ జెండాతో.. సరిహద్దుల్లో విమానం ఆకారంలో బెలూన్..

Pia

భారత్, పాకిస్తాన్ సరిహద్దుల్లో కొంతకాలంగా ప్రశాంత వాతావరణం నెలకొని ఉంది. ఇరుదేశాల సైన్యాధికారులు శాంతి ఒప్పందం చేసుకోవడంతో ఆయుధాలను పక్కన పెట్టి శాంతియుతంగా మెలుగుతున్నారు. సైనికులు కూడా కాస్త ప్రశాంతంగ ఇక ఈ నేపథ్యంలోనే విమానం ఆకారంలో ఉన్న ఒక బెలూన్ సరిహద్దులో ప్రత్యేక్షమైంది. దీనిపై PIA అని రాసి ఉంది.. అంటే పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ అని అర్ధం. జమ్మూకాశ్మీర్ లోని కానాచక్ ప్రాంతంలో దీనిని గుర్తించారు జమ్మూకాశ్మీర్ పోలీసులు. స్వాధీనం చేసుకొని పరిశీలిస్తున్నారు.

సరిహద్దులో ఇటువంటి బెలూన్స్ కనిపించడం ఈ నెలలో ఇది మూడోసారి.. మార్చి 10, 16 తేదీల్లో హరినగర్, బాల్వాల్ ప్రాంతాల్లో రెండు బెలూన్ లు కనిపించాయి వాటిని పోలీసులు స్వాధీనం చేసుకొని పరిశీలించారు. వాటిలో ఏముంది అనే విషయం తెలియరాలేదు. ఇక మార్చి 30 న మరో బెలూన్ కనిపించడంతో అప్రమత్తమయ్యారు జమ్మూ పోలీసులు.. పాక్ సంబందించిన వారు ఈ పని చేస్తున్నారా? లేదంటే స్థానికంగా ఉన్నవారు అలజడి సృష్టించేందుకు ఈ విధంగా చేస్తున్నారా? అనే కోణం విచారణ చేపట్టారు.

అయితే గతంలో పాకిస్థాన్ డ్రోన్లు అక్రమంగా భారత భూభాగంలోకి దూసుకొచ్చేవి.. గతంలో రెండు పాక్ డ్రోన్లను భారత జవాన్లు కూల్చేశారు. కొన్ని సార్లు కెమెరాలు తగిలించిన డ్రోన్లను పాక్ భారత సరిహద్దుల్లో తిప్పింది. దీనిని గమనించిన భారత సైనికులు వెంటనే డ్రోన్లపై దాడికి దిగడంతో వెనుదిరిగాయి. ఇక ఇప్పుడు ఈ బెలూన్ల విషయాన్నీ జమ్మూ పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. ఇటివంటి వాటిని తేలికగా తీసుకుంటే పెద్ద జరిగే అవకాశం లేకపోలేదని భావిస్తున్నారు పోలీసులు. ఈ నేపథ్యంలోనే విచారణ వేగవంతం చేశారు.