Airplane Restaurant : గుజరాత్ లో తొలి ఎయిర్‌క్రాఫ్ట్ రెస్టారెంట్
గుజరాత్ లో తొలి ఎయిర్‌క్రాఫ్ట్ రెస్టారెంట్ ప్రారంభమైంది. వడోదరలోని తర్సాలి బైపాస్‌లో ఈ ప్రత్యేకమైన రెస్టారెంట్ ని నిర్మించారు. బెంగళూరుకు చెందిన ఓ కంపెనీ నుంచి రూ.1.40 కోట్లకు

Aircraft (1)
Airplane Restaurant గుజరాత్ లో తొలి ఎయిర్‌క్రాఫ్ట్ రెస్టారెంట్ ప్రారంభమైంది. వడోదరలోని తర్సాలి బైపాస్‌లో ఈ ప్రత్యేకమైన రెస్టారెంట్ ని నిర్మించారు. బెంగళూరుకు చెందిన ఓ కంపెనీ నుంచి రూ.1.40 కోట్లకు ఎయిర్ బస్-320 స్క్రాప్ ఎయిర్‌క్రాఫ్ట్ ను కొనుగోలు చేసి..విమానంలోని కొన్ని భాగాలను విడదీసి వడోదరకు తరలించి రెస్టారెంట్‌గా మార్చినట్లు రెస్టారెంట్ యజమాని ముఖి తెలిపారు.
ఎయిర్‌క్రాఫ్ట్‌కు రెస్టారెంట్ రూపాన్ని అందించడానికి దాదాపు రూ.60-65 లక్షల అదనపు వ్యయం జరిగిందని, మొత్తం ఖర్చు రూ.2 కోట్లు అయిందని ముఖి తెలిపారు. పంజాబీ, చైనీస్, కాంటినెంటల్, ఇటాలియన్, థాయ్, మెక్సికన్ వంటకాలను ఈ రెస్టారెంట్లో ఆందుబాటులో ఉంచినట్లు తెలిపారు. వెయిటర్ని పిలవడానికి ఫ్లైట్ లోలాగానే ఇందులో సెన్సార్లు అమర్చారు. అతిథులకు ఫీల్ వచ్చేందుకు మధ్యమధ్యలో టేకాఫ్ అవుతున్నట్లు విమానాన్ని కదిపే ఏర్పాట్లు కూడా చేశారు.
కాగా, ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి ఎయిర్‌క్రాఫ్ట్ రెస్టారెంట్లు.. వడోదరతో కలిసి 9 ఉండగా.. భారత్ లో నాల్గవది. భారత్ లో పంజాబ్‌లోని లూథియానా, హర్యానాలోని అంబాలా, ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో ఇప్పటికే ఎయిర్‌క్రాఫ్ట్ రెస్టారెంట్లు ఉన్నాయి. ఇక,గుజరాత్ లో ఇదే తొలి ఎయిర్ క్రాఫ్ట్ రెస్టారెంట్.