Airtel 5G Network Trial : జియోకు పోటీగా ఎయిర్‌టెల్ 5G.. టెస్టింగ్‌లోనే 1Gbps స్పీడ్ దాటేసింది..

దేశంలోని టెలికాం కంపెనీలకు 5G టెక్నాలజీ ట్రయల్స్ కోసం కేంద్రం అనుమతినిచ్చిన నేపథ్యంలో ఎయిర్‌టెల్ 5G నెట్‌వర్క్‌ను గుర్గావ్‌లోని సైబర్ హబ్ లో ప్రారంభించింది. రిలయన్స్ జియోకు పోటీగా ఎయిర్ టెల్ 5G నెట్ వర్క్ రంగంలోకి దిగింది.

Airtel 5G Network Trial : జియోకు పోటీగా ఎయిర్‌టెల్ 5G.. టెస్టింగ్‌లోనే 1Gbps స్పీడ్ దాటేసింది..

Airtel 5g Network

Airtel 5G Network Trial : దేశంలోని టెలికాం కంపెనీలకు 5G టెక్నాలజీ ట్రయల్స్ కోసం కేంద్రం అనుమతినిచ్చిన నేపథ్యంలో ఎయిర్‌టెల్ 5G నెట్‌వర్క్‌ను గుర్గావ్‌లోని సైబర్ హబ్ లో ప్రారంభించింది. రిలయన్స్ జియోకు పోటీగా ఎయిర్ టెల్ 5G నెట్ వర్క్ రంగంలోకి దిగింది. 5G ట్రయల్స్‌కు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన నెల రోజుల్లోనే ఎయిర్‌టెల్ ట్రయల్ రన్ టెస్టింగ్ చేసింది. ఎయిర్‌టెల్ గరిష్టంగా 1Gbps వేగంతో ఇంటర్నెట్‌ను ఆఫర్ చేస్తోంది. స్వీడన్ ఎక్విప్‌మెంట్ మేకర్ ఎరిక్‌సన్‌తో కలిసి ఎయిర్‌టెల్ ఈ టెస్టింగ్ నిర్వహిస్తోంది. ముంబైలోనూ 5G ట్రయల్స్ నిర్వహించాలని ఎయిర్‌టెల్ భావిస్తోంది.

గుర్గావ్‌లోని సైబర్ హబ్‌లో 3500 మెగా Hz మిడిల్ బ్యాండ్ స్పెక్ట్రంలో టెస్టింగ్ చేసింది ఎయిర్ టెల్. ఎయిర్‌టెల్ టెలికమ్యూనికేషన్ విభాగం(DoT) మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ ట్రయల్స్ నిర్వహిస్తోంది. ఎరిక్సన్, నోకియా, శామ్సంగ్, సీ-డాట్ టెక్నాలజీ ప్రొవైడర్లతో టీఎస్‌పీలు డీల్ కుదుర్చుకున్నాయి. రిలయన్స్ జియో తన సొంత దేశీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ 5G ట్రయల్స్ నిర్వహించనుంది. 5G నెట్‌వర్క్ పరీక్షల దశలోనే ఎయిర్‌టెల్ 1Gbps వేగాన్ని అందించనుంది. ప్రస్తుతం దేశంలో అందుబాటులో ఉన్న 4G నెట్‌వర్క్‌కు వేగం కంటే చాలా వేగవంతమైనది. ప్రపంచవ్యాప్తంగా మొబైల్ ఇంటర్నెట్ వేగంలో భారత్ 130వ స్థానంలో కొనసాగుతోంది.

దేశంలో సగటు డౌన్‌లోడ్ స్పీడ్ 12.81 Mbps కాగా, అప్‌లోడు స్పీడ్ 4.79Mbps వేగాన్ని అందిస్తోంది. ఎయిర్‌టెల్ దేశంలోని ఇతర ప్రాంతాలలో మిడ్-స్పెక్ట్రంను పరీక్షించే అవకాశం ఉంది. ఎకనామిక్ టైమ్స్ టెలికాం నివేదిక ప్రకారం.. ఈ ట్రయిల్స్ లో 1 Gbps వేగానికి కంటే ఎక్కువ వేగాన్ని అందుకుంది. ఎయిర్‌టెల్‌కు 5G ట్రయల్ కోసం 3500 మెగా Hz, 28 గిగా Hz, 700 మెగా Hz స్పెక్ట్రంను కేటాయించినట్లు నివేదిక పేర్కొంది.

రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియా(వి)లకు 700 మెగాహెర్ట్జ్‌, 3.5 గిగాహెర్ట్జ్, 26 గిగాహెర్ట్జ్ బ్యాండ్లలో స్పెక్ట్రమ్‌లను కేటాయించారు. 5జీ ట్రయిల్స్ కోసం దరఖాస్తు చేసుకున్న టీఎస్‌పీలలో ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియా, ఎమ్‌టిఎన్‌ఎల్ ఉన్నాయి. ఎయిర్‌టెల్ 5G ట్రయల్స్ కోసం ఎరిక్సన్ 5G నెట్‌వర్క్ గేర్‌తో పనిచేస్తోంది.