Airtel Tariff Hike : ఎయిర్‌టెల్ యూజర్లకు బిగ్ షాక్.. రీఛార్జ్ ప్లాన్ ధర భారీగా పెంపు

ప్రముఖ టెలికం కంపెనీ ఎయిర్ టెల్.. తన యూజర్లకు బిగ్ షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. 28 రోజుల కనీస రీఛార్జ్ ప్లాన్ ధరను 57శాతం పెంచింది. గతంలో ఉన్న రూ.99 రీఛార్జ్ ప్లాన్ ను నిలిపివేసి దాన్ని రూ.155 ప్లాన్ కింద ప్రారంభించింది.

Airtel Tariff Hike : ఎయిర్‌టెల్ యూజర్లకు బిగ్ షాక్.. రీఛార్జ్ ప్లాన్ ధర భారీగా పెంపు

Airtel Tariff Hike : ప్రముఖ టెలికం కంపెనీ ఎయిర్ టెల్.. తన యూజర్లకు బిగ్ షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. 28 రోజుల కనీస రీఛార్జ్ ప్లాన్ ధరను 57శాతం పెంచింది. గతంలో ఉన్న రూ.99 రీఛార్జ్ ప్లాన్ ను నిలిపివేసి దాన్ని రూ.155 ప్లాన్ కింద ప్రారంభించింది. ప్రస్తుతం ఒడిశా, హర్యానాలో పైలెట్ ప్రాజెక్ట్ కింద ఈ ప్లాన్ ను అమలు చేస్తోంది. త్వరలోనే దేశం మొత్తం అమలు చేయనున్నట్లు సమాచారం. ఇందులో అన్ లిమిటెడ్ కాలింగ్, 1జీబీ డేటా, 300 ఎస్ఎంఎస్ లు ఉంటాయి.

ఇప్పటి వరకు హర్యానా, ఒడిశాలో Airtel కనీస రీఛార్జ్ ప్లాన్ ధర రూ.99. ఈ ప్లాన్ కింద 200 ఎంబీ మొబైల్ డేటా లభించేది. సెకనుకు రూ.2.5 పైసల చొప్పున కాల్స్ అందించింది. ఇప్పుడు రూ.155 ప్లాన్‌ను అందిస్తుంది. ఈ ప్లాన్ కింద 1GB డేటా లభిస్తుంది. 300 SMSలు, అపరిమిత వాయిస్ కాలింగ్‌ను అందిస్తుంది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

PTI నివేదిక ప్రకారం, కంపెనీ కొత్త ప్లాన్ యొక్క ట్రయల్‌ను ప్రారంభించింది. దాని ఫలితం ఆధారంగా భారతదేశం అంతటా అదే విధంగా విడుదల చేసే అవకాశం ఉంది. రూ.155 కంటే తక్కువ ధర ఉన్న SMS మరియు డేటాతో 28 రోజుల కాలింగ్ ప్లాన్‌లను ఎయిర్ టెల్ త్వరలో ముగించవచ్చని పేర్కొంది.

మునుపటి రూ.99 రీఛార్జ్‌ ప్లాన్ లో రూ.99 టాక్-టైమ్, 200 MB పరిమిత డేటా 28 రోజుల వాలిడిటీతో లభించేంది. ఇప్పుడు కొత్తగా ప్రారంభించిన రూ.155 కనీస రీఛార్జ్ ప్లాన్ కింద.. అపరిమిత వాయిస్, 1GB డేటా, 300 SMSలను అందిస్తుంది. ఇది కనిష్ట రీఛార్జ్ విలువలో 57 శాతం పెంపు.

“ప్రస్తుత మార్కెట్ పరిస్థితిలో సుంకాల పెంపును అమలు చేయడంలో భారతి పరిశ్రమ మొదటి అడుగు వేసింది. ఇప్పుడు పోటీదారు ప్రతి స్పందన కోసం వేచి చూస్తోంది. దానికి తగిన మద్దతు లభించకపోతే, ఎయిర్ టెల్ రూ.99 రీఛార్జి ప్లాన్ ను పునరుద్ధరించాల్సి రావచ్చు. అప్పుడు సుంకాల పెంపు కోసం తదుపరి చర్య ఎవరు తీసుకుంటారో ఊహించడం కష్టంగా ఉంటుంది. ఎయిర్ టెల్ దానికి మద్దతు ఇస్తుందా? లేదా ఎయిర్ టెల్ ‘తన పోటీదారులు తిరస్కరించలేని ఆఫర్‌ను చేసిందా?” అనేది తెలియాల్సి ఉందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి.