దుష్యంత్ తండ్రికి 14 రోజులు పెరోల్

  • Published By: chvmurthy ,Published On : October 26, 2019 / 12:17 PM IST
దుష్యంత్ తండ్రికి 14 రోజులు పెరోల్

హర్యానాలో బీజేపీతో కలిసి ఆదివారం అధికారం పంచుకుంటున్న జననాయక్ జనతా పార్టీ వ్యవస్ధాపకుడు అజయ్ చౌతాలాకు తీహార్ జైలు అధికారులు 2 వారాల శలవు (ఫర్లో) మంజూరు చేశారు. జేజేపీ అధ్యక్షుడు దుష్యంత్ చౌతాలాకు అజయ్ చౌతాలా తండ్రి. హర్యానాలో ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపీకి మద్దతిస్తున్నట్టు జేజేపీ నేత దుష్యంత్ చౌతాలా ప్రకటించిన మరుసటి రోజే అజయ్ చౌతాలాకు ‘ఫర్‌లో’ మంజూరు కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.  దుష్యంత్ చౌతాలా నాయకత్వంలోని జేజేపీ మొత్తం 10 చోట్ల విజయం సాధించింది.  ఐఎన్ఎల్డీ నుంచి బహిష్కరణకు గురైన దుష్యంత్ చౌతాలా,  తన ముత్తాత పేరుతో పార్టీని స్థాపించి పది నెలల్లోనే సత్తా చాటారు.

జైలులో ఉండే ఏ ఖైదీ అయినా ఏడాదిలో 14 రోజుల పాటు సెలవు పొందేందుకు (ఫర్‌లో) అర్హత కలిగి ఉంటాడు. జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు సంవత్సరానికి 3 పెరోల్స్ ఇవ్వోచ్చని, అందులో మొదటి పెరోల్ అజయ్   ఆగస్టులో ఉపయోగించుకున్నారని అధికారులు చెప్పారు.  అజయ్ చౌతాలా తన తల్లి మాసికం పెట్టేందుకు ఆగస్టులో ఒక పెరోల్ ఉపయోగించుకున్నారు. ఇప్పడు రెండో పెరోల్ ఉపయోగించుకుని శనివారం సాయంత్రం కానీ, ఆదివారం ఉదయం కానీ బయటకు వస్తారు. 

హర్యానాలో టీచర్ల రిక్రూట్ మెంట్ కుంభ కోణం కేసులో అజయ్ చౌతాలా, అతని తండ్రి హర్యానా మాజీ సీఎం ఓం ప్రకాష్ చౌతాలాల తీహార్ జైలులో 10 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఢిల్లీ కోర్టు 2013,జనవరిలో వీరిద్దరితో పాటు ఇద్దరు ఐఏఎస్ అధికారులు, మరో 53 మందిని ఢిల్లీ కోర్టు దోషులుగా తేల్చింది. తన ముత్తాత దేవీలాల్‌తో పాటు దుష్యంత్‌ చౌతాలా ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పర్యటించి 10స్ధానాలు గెలుచుకున్నారు.