Ajay Jadeja : చెత్త పని.. భారత మాజీ క్రికెటర్ కు రూ.5వేలు జరిమానా

భారత మాజీ క్రికెటర్ అజయ్ జడేజాకు జరిమానా విధించారు. రూ.5వేలు ఫైన్ వేశారు. ఎందుకో తెలుసా? బహిరంగ ప్రదేశంలో చెత్త వేసినందుకు.

Ajay Jadeja : చెత్త పని.. భారత మాజీ క్రికెటర్ కు రూ.5వేలు జరిమానా

Ajay Jadeja

Ajay Jadeja : భారత మాజీ క్రికెటర్ అజయ్ జడేజాకు జరిమానా విధించారు. రూ.5వేలు ఫైన్ వేశారు. ఎందుకో తెలుసా? బహిరంగ ప్రదేశంలో చెత్త వేసినందుకు. వివరాల్లోకి వెళితే.. అజయ్ జడేజాకు నార్త్ గోవాలోని పిక్చర్ స్వ్కేర్ అల్డోనా గ్రామంలో బంగ్లా ఉంది. అయితే ఆ బంగాల్లోని సిబ్బంది.. చెత్తను తీసుకెళ్లి సమీపంలోనే ఉన్న నచ్చినోలా గ్రామాంలో పడేశారు. దీంతో నచ్చినోలా గ్రామ సర్పంచి తృప్తి బందోద్కర్ సీరియస్ అయ్యారు.

తమ గ్రామంలో చెత్త వేసిన వారి వివరాలు సేకరించే పనిలో పడ్డాడు. అలా చెత్తలో వెతకగా.. ఓ బిల్లు కనిపించింది. దానిపై అజయ్ జడేజా పేరుంది. అంతే.. దాని సాయంతో తమ గ్రామంలో చెత్త వేసింది అజయ్ జడేజా అని తెలుసుకున్నాడు. అజయ్ జడేజాను తప్పుపడుతూ రూ.5వేలు జరిమానా విధించాడు నచ్చినోలా గ్రామ సర్పంచి. తన తప్పుని అంగీకరించిన జడేజా మారు మాట్లాడకుండా జరిమానా చెల్లించాలరని సర్పంచి తెలిపాడు.

”మా గ్రామంలో చెత్త పెద్ద సమస్యగా మారింది. చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఇతర ప్రాంతాల నుంచి వ్యర్థాలు తెచ్చి మా గ్రామంలో డంప్ చేస్తున్నారు. దీంతో కొంతమంది యువకులను నియమించాము. చెత్తలో నుంచి ఆధారాలు సేకరించాలని ఆదేశించాము. వారు చెత్తలో వేసిన బ్యాగులను తీసుకుని స్కాన్ చేస్తారు. ఎవరైతే చెత్త వేశారో వారి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు” అని గ్రామ సర్పంచి తెలిపాడు.

”ఇదే క్రమంలో చెత్తలో ఉన్న కొన్ని బ్యాగులపై బిల్లు ఉంది. ఆ బిల్లులో అజయ్ జడేజా పేరుంది. వెంటనే ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లాము. అంతేకాదు భవిష్యత్తులో మా గ్రామంలో చెత్త వేయొద్దని జడేజాకు సూచించాము. అయితే జరిమానా విధించేందుకు తాను సిద్ధమని జడేజా చెప్పారు. అంతేకాదు జరిమానా చెల్లించారు కూడా. ఓ సెలబ్రిటీ, ప్రముఖ క్రికెట్ ప్లేయర్ మా గ్రామంలో ఉండటం ఆనందంగా ఉంది. మాకు గర్వకారణం. అదే సమయంలో అలాంటి ప్రముఖులు ఎక్కడపడితే అక్కడ చెత్త వేయకుండా నిబంధనలు పాటిస్తే బాగుంటుంది” అని సర్పంచి బందోద్కర్ అన్నాడు.

1992లో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన అజయ్ జడేజా.. తన కెరీర్ లో 15 టెస్టులు, 196 వన్డే మ్యాచులు ఆడాడు. వన్డేల్లో 6 సెంచరీలు, 30 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. 2000లో రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రస్తుతం క్రికెట్ కామెంటేటర్‌గా కంటిన్యూ అవుతున్నాడు.