Amritpal Singh: అమృత్‌పాల్ సింగ్ అనుచరుల్ని విడుదల చేయండి.. పంజాబ్ పోలీసులకు సిక్కు సంస్థ అల్టిమేటం

సిక్కు సంస్థల్లో ప్రధానమైన ‘అకాల్ తక్త్’ సంస్థ అమృత్‌పాల్ సింగ్ అంశంపై స్పందించింది. పంజాబ్ ప్రభుత్వ తీరు, పోలీసుల వైఖరిపై మండిపడింది. సంస్థకు చెందిన జియాని హర్‌ప్రీత్ సింగ్ ఆధ్వర్యంలో సోమవారం ఒక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వివిధ సిక్కు సంఘాలు పాల్గొన్నాయి.

Amritpal Singh: పంజాబ్ పోలీసులకు ఒక సిక్కు సంస్థ అల్టిమేటం జారీ చేసింది. ఇటీవల పోలీసులు అరెస్టు చేసిన అమృత్‌పాల్ సింగ్ అనుచరుల్ని 24 గంటల్లోగా విడుదల చేయాలని సూచించింది. సిక్కు సంస్థల్లో ప్రధానమైన ‘అకాల్ తక్త్’ సంస్థ అమృత్‌పాల్ సింగ్ అంశంపై స్పందించింది.

EPFO: ప్రావిడెంట్ ఫండ్‌పై వడ్డీ రేటు 8.15 శాతం.. నిర్ణయించిన ఈపీఎఫ్ఓ

పంజాబ్ ప్రభుత్వ తీరు, పోలీసుల వైఖరిపై మండిపడింది. సంస్థకు చెందిన జియాని హర్‌ప్రీత్ సింగ్ ఆధ్వర్యంలో సోమవారం ఒక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వివిధ సిక్కు సంఘాలు పాల్గొన్నాయి. సిక్కు లాయర్లు, రాజకీయ నేతలు, మేధావులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా పంజాబ్ పోలీసులు, ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. ఇటీవల అదుపులోకి తీసుకున్న అమృత్‌పాల్ సింగ్ అనుచరుల్ని 24 గంటల్లోగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే గ్రామస్థాయి నుంచి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ‘ఖల్సా వహిర్’ను అమలు చేస్తామని హెచ్చరించారు. మరోవైపు హిందూ రాష్ట్రం కోసం ఉద్యమిస్తున్న వారిని ఇలాగే ఎందుకు అరెస్టు చేయలేదని ‘అకాల్ తక్త్’ సంస్థ ప్రశ్నించింది.

Hyderabad Traffic Restrictions : హైదరాబాద్ ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ దగ్గర మూడు నెలలు ట్రాఫిక్ ఆంక్షలు

‘‘లక్షల మంది హిందూ రాష్ట్రం కోసం డిమాండ్ చేస్తున్నారు. ఖలిస్తాన్ కోసం ఉద్యమిస్తున్న వారిపై చర్యలు తీసుకున్నట్లుగానే, హిందూ రాష్ట్రం కోసం ఉద్యమిస్తున్న వారిపై కూడా చర్యలు తీసుకుంటారా? వాళ్లను కూడా ఎన్ఎస్ఏ (నేషనల్ సెక్యూరిటీ యాక్ట్) కింద అరెస్టు చేస్తారా?’’ అని ‘అకాల్ తక్త్’ సంస్థ ప్రశ్నించింది. మరోవైపు… ఇటీవల అదుపులోకి తీసుకున్న వారిలో ఆందోళనలు, అల్లర్లతో సంబంధం లేని వారిని వదిలిపెట్టాల్సిందిగా సీఎం భగవంత్ మన్ పోలీసుల్ని ఆదేశించారు. అయితే, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ఆయన ఆదేశించారు.

ట్రెండింగ్ వార్తలు