Akhand Bharat : ‘అఖండ భారతం’ త్వరలోనే సాకారమవుతుంది..దీన్ని ఎవ్వరూ ఆపలేరు : RSS చీఫ్ మోహన్ భగవత్

‘అఖండ భారతం’ త్వరలోనే సాకారమవుతుంది..దీన్ని ఎవ్వరూ ఆపలేరు అని RSS చీఫ్ మోహన్ భగవత్ అన్నారు.

Akhand Bharat : ‘అఖండ భారతం’ త్వరలోనే సాకారమవుతుంది..దీన్ని ఎవ్వరూ ఆపలేరు : RSS చీఫ్ మోహన్ భగవత్

Akhand Bharat Will Be A Reality Soon Said Rss Chief Mohan Bhagwat

Akhand Bharat will be a reality soon said RSS chief Mohan Bhagwat : ‘అఖండ భారతం’ కల త్వరలోనే సాకారమవుతుంది..భారత్ తన లక్ష్యాన్ని చేరకుండా ఎవరూ అడ్డుకోలేరు అంటూ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. మరో 20-25 ఏళ్లలో అఖండ భారతం సిద్ధిస్తుందన్న స్వామి రవీంద్ర పూరి అన్నారని..ఆయన మాటలతో తాను ఏకీభవిస్తానని RSS చీఫ్ మోహన్ భగవత్ అన్నారు.

అఖండ భారత్ అంటే..ప్రస్తుతం ఉన్న మన భారతదేశం,పాకిస్తాన్, బంగ్లాదేశ్, బర్మా, టిబెట్, ఆఫ్గనిస్తాన్, శ్రీలంక, నేపాల్, భూటాన్ లను కలిపి అఖండ భారత్ అంటారు. అంటే బ్రిటిష్ పాలనకు ముందున్న భారతదేశం. బ్రిటీష్ వాళ్ళు సువిశాల అఖండ భారతదేశాన్ని పాలించి, కొన్ని దేశాలుగా చీల్చి స్వతంత్రం ఇచ్చి వెళ్ళిపోయారు. విశ్వహిందూ పరిషత్, బజరంగదళ్, దుర్గావాహిని మొదలైన సంస్థలు ఈనాటికి కూడా అఖండ భారత్ సాధించాలని కృషిచేస్తున్నాయి. ఈ క్రమంలో RSS చీఫ్ మోహన్ భగవత్ అఖండ్ భారతం కల త్వరలోనే నెరవేరబోతోంది అని వ్యాఖ్యానించటం మరోసారి ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

Also read : SALESHWARAM FESTIVAL : సాహస యాత్ర సలేశ్వరం.. నేటి నుంచి ఉత్సవాలు ప్రారంభం.. తెలంగాణ అమర్‌నాథ్ యాత్రగా ప్రసిద్ధి..

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం వచ్చే 20-25 ఏళ్లలో అఖండ భారత్ కల నిజమవుతుందని అఖిల భారతీయ అఖాడా పరిషత్ అధ్యక్షుడు స్వామి రవీంద్ర పూరి(మహానిర్వాని అఖాడా) ఇటీవల పేర్కొన్నారు. స్వామి రవీంద్ర పూరి వ్యాఖ్యలను ఉటంకిస్తూ మోహన్ భగవత్ తాను కూడా స్వామివారి ప్రకటనతో ఏకీభవిస్తానని అన్నారు. అరబిందో వంటి తత్వవేత్తలు చెప్పినట్టు వాసుదేవుడి (శ్రీకృష్టుడి) కోరిక మేరకు భారతదేశం ఎదుగుతుందని అన్నారు. ఇండియా గురించి స్వామి వివేకానంద, అరబిందో చెప్పిన మాటలను తాను నమ్ముతానని అన్నారు. స్వామి వివేకానందపై నాకు పూర్తి విశ్వాసం ఉంది అని అన్నారు.

అఖండ భారతం విషయాన్ని తన సొంత లెక్కలతో చెబుతున్నాను తప్పితే జ్యోతిష్యశాస్త్రాన్ని అనుసరించి కాదని స్పష్టం చేశారు. ఏది ఏమైనప్పటికీ స్వామి రవీంద్ర పూరి చెప్పిన దానిపై పూర్తి విశ్వాసం ఉందని మాత్రం చెప్పగలనని భగవత్ చెప్పారు. అది తప్పకుండా జరిగి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం మనం కదులుతున్న వేగంతోనే ముందుకెళ్తే 25-30 ఏళ్లలో అఖండ భారతం సిద్ధిస్తుందని, అందరం కలిసి మరింత వేగంగా ముందడుగు వేస్తే ఈ దూరాన్ని సగానికి సగం తగ్గించవచ్చని చెప్పుకొచ్చారు భగవత్.

Also read : Kim Jong Un: అట్లుంటది మనతోని.. న్యూస్‌ రీడర్‌ను ఆశ్చర్యపర్చిన కిమ్.. ఏకంగా బంగ్లానే రాసిచ్చేశాడు..

శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్టు మంచిని కాపాడుతూ ఉండాలని, అలాగే దుష్టులను నాశనం చేయడం మర్చిపోకూడదని అన్నారు. భారత్ తన లక్ష్యాన్ని చేరకుండా ఎవరూ అడ్డుకోలేరని ఆరెస్సెస్ చీఫ్ స్పష్టం చేశారు.