UP Poll : కర్హాల్ నుంచి అఖిలేష్ పోటీ

తమ పార్టీ అధికారంలోకి వస్తే...22 లక్షల మందికి ఐటీ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని కీలక ప్రకటన చేశారు ఎస్పీ అధ్యక్షులు అఖిలేశ్. యువతకు శిక్షణ కల్పించి ఉద్యోగాలు కల్పించే దిశగా..

UP Poll : కర్హాల్ నుంచి అఖిలేష్ పోటీ

Akhilesh Yadav

Akhilesh Yadav Contest : ఉత్తరప్రదేశ్‌ మాజీ సీఎం.. సమాజ్‌వాది పార్టీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌ తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయనున్నారు. మైన్‌పురి జిల్లాలోని కర్హాల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అఖిలేష్‌ యాదవ్‌ పోటీ చేయనున్నారు. గత కొద్దిరోజులుగా ఏ నియోజకవర్గం నుంచి పోటీచేయాలన్న దానిపై సుదీర్ఘంగా చర్చించారు అఖిలేష్‌ యాదవ్‌. మైన్‌పురి జిల్లా సమాజ్‌వాదీ పార్టీకి కంచుకోటగా ఉంది. మైన్‌పురి పార్లమెంటరీ నియోజకవర్గానికి ప్రస్తుతం ములాయం సింగ్ యాదవ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

Read More : Minister Vellampalli : హిందువులపై బీజేపీది కపట ప్రేమ : మంత్రి వెల్లంపల్లి

కర్హాల్ నియోజకవర్గంలో లక్షా 44 వేల మంది యాదవ వర్గం ఓట్లు ఉండటంతో అఖిలేష్‌కు ఇది సురక్షితమైన సీటుగా భావిస్తున్నారు. అఖిలేష్ ప్రస్తుతం అజాంగఢ్ లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తాజాగా, తమ కుటుంబానికి కలిసి వచ్చిన మైన్‌పురి జిల్లాలోని కర్హాల్ నియోజకవర్గాన్ని ఖరారు చేసుకున్నారు. అయితే మరో నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేయాలని అఖిలేష్‌ భావిస్తున్నట్టు సమాచారం.

Read More : Telugu Small Movies: రిలీజ్ కష్టాలు.. చిన్న సినిమాలకు పెద్ద చిక్కులు!

మరోవైపు…తమ పార్టీ అధికారంలోకి వస్తే…22 లక్షల మందికి ఐటీ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని కీలక ప్రకటన చేశారు ఎస్పీ అధ్యక్షులు అఖిలేశ్. యువతకు శిక్షణ కల్పించి ఉద్యోగాలు కల్పించే దిశగా తమ పార్టీ కృషి చేయడం జరుగుతుందని, ఐటీ రంగంలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళుతామని తెలిపారు. తమ ప్రభుత్వ హయాంలో చేసిన పనులను ముందుకు తీసుకెళ్లి..ఉంటే లఖ్ నవూ ఐటీ హబ్ గా గుర్తింపు పొంది ఉండేదన్నారు. అనంతరం తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఏమి చేయలేదని ఆరోపించారు.