UP Election 2022 : అధికారంలోకి వస్తే… గృహాలకు 300 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్

జేపీ నేతలకు కౌంటర్ ఇచ్చే సమయం కూడా ఇవ్వకుండా పార్టీలో ముసలం రాజేస్తున్నారు. దీంతో ఈ సారి అధికార పీఠం ద‌క్కించుకునేందుకు ప‌క్కా ప్రణాళిక‌ల‌తో...

UP Election 2022 : అధికారంలోకి వస్తే… గృహాలకు 300 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్

Akhilesh Yadav

Akhilesh Yadav : ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నిక‌లకు స‌మ‌యం ద‌గ్గర‌ప‌డుతున్న కొద్ది రాజ‌కీయాలు రస‌వ‌త్తరంగా మారుతున్నాయి. అధికార బీజేపీని కార్నర్‌ చేయడానికి సమాజ్‌వాద్‌ పార్టీ పద్మవ్యూహాలను పన్నుతోంది. ఇప్పటికే కీలక నేతలను తనవైపు లాక్కోని కమలం పార్టీలో కలకలం రేపిన మాజీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌.. ఇప్పుడు ఓటర్లను తనవైపు తిప్పుకపోవడానికి ఉచిత విద్యుత్‌ అస్త్రాన్ని తెరపైకి తీసుకొచ్చారు. తాము అధికారంలోకి వస్తే గృహ వినియోగదారులందరికి 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌.. ఇక వ్యవసాయ అవసరాల కోసం ఉపయోగించే విద్యుత్‌ ఫ్రీ అంటూ యూపీ ప్రజలకు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించారు అఖిలేశ్‌ యాదవ్. ప్రకటనతోనే సరిపెట్టక ఈ అంశాన్ని ప్రతి ఒక్క ఇంటికి చేరేలా నేటి నుంచి ఇంటింటి ప్రచారం నిర్వహించనున్నారు. నామ్‌ లికావో.. చూట్‌ నా జావో.. అని దీనికి నామకరణం కూడా చేశారు. ఎవరికైతే 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ అవసరమో వారంతా తమ పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు అఖిలేశ్‌ యాదవ్‌.

Read More : Sreekanth Vettiyar Rape Case : పెళ్లి పేరుతో అత్యాచారం చేసిన యూట్యూబర్ పై కేసు నమోదు

త్వరలో జరగనున్న యూపీ ఎన్నికల కోసం సమాజ్‌వాదీ పార్టీ విడుదల చేసే మేనిఫెస్టోలో ఉచిత విద్యుత్‌ అంశమే నంబర్‌ వన్ వాగ్ధానమని ప్రకటించారు అఖిలేశ్‌ యాదవ్‌. యోగీ ప్రభుత్వంలో మంత్రిగా ఉండి ఇటీవలే ఎస్పీ తీర్థం పుచ్చుకున్న స్వామి ప్రసాద్‌ మౌర్యను పక్కన కూర్చొబెట్టుకొని మరీ ఈ వాగ్ధానాలను ప్రకటించారు అఖిలేశ్. దీంతో అటు ప్రజలను తనవైపు తిప్పుకుంటూనే.. ఇటు అధికార బీజేపీకి చురకలు అంటిస్తున్నారు. ఇక యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ గోరఖ్‌పూర్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారా ? లేక ఇతర నియోజవకర్గం నుంచి పోటీ చేస్తారా అనేది తెలియరాలేదు.

Read More : AP PRC: ఉద్యోగుల అభ్యంతరాలపై ప్రభుత్వం సమాలోచనలు

సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా రాధా మోహన్‌దాస్ అగర్వాల్‌కు బీజేపీ హైకమాండ్‌ ఏ సీటు కేటాయిస్తుందో ఇంకా స్పష్టత లేదు. దీంతో ఆయన సమాజ్‌వాదీ పార్టీలో చేరి యోగి ఆదిత్యనాథ్‌పై పోటీ చేయాలంటూ బంపర్ ఆఫర్‌ ఇచ్చారు. అఖిలేశ్‌ వ్యవహారం చూస్తుంటే రెండు వైపులా పదనున్న కత్తిని కదనరంగంలోకి దింపారా ? అన్నట్టుగా సాగుతోంది ఆయన ప్రచారం. ఈసారి యూపీలో కమలం వికసించకుండా ఓ వైపు ప్రజలను ఆకట్టుకునేలా హామీల వర్షం కురిపిస్తూనే.. మరోవైపు బీజేపీ నేతలకు కౌంటర్ ఇచ్చే సమయం కూడా ఇవ్వకుండా పార్టీలో ముసలం రాజేస్తున్నారు. దీంతో ఈ సారి అధికార పీఠం ద‌క్కించుకునేందుకు ప‌క్కా ప్రణాళిక‌ల‌తో ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది.