అఖిలేష్ వదిలేస్తాడుగా! : మాయావతికి బీజేపీ మద్దతు

ఎస్పీ-బీఎస్పీ కూటమిపై ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య సంచలన వ్యాఖ్యలు చేశారు.

  • Published By: venkaiahnaidu ,Published On : April 8, 2019 / 12:02 PM IST
అఖిలేష్ వదిలేస్తాడుగా! : మాయావతికి బీజేపీ మద్దతు

ఎస్పీ-బీఎస్పీ కూటమిపై ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఎస్పీ-బీఎస్పీ కూటమిపై ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య సంచలన వ్యాఖ్యలు చేశారు. మే-23,2019న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే మాయావతిని అఖిలేష్ వదిలేస్తారన్నారని మోర్య అన్నారు. సమాజ్ వాదీ పార్టీ దళితులకు ఎప్పుడూ సరైన గౌరవం ఇవ్వలేదన్నారు.1995లో ములాయం సింగ్ యాదవ్ డైరక్షన్ లో స్టేట్ గెస్ట్ హౌస్ లో ఉన్న మాయావతిపై దాడి జరిగినప్పుడు బీజేపీ ఆమెను కాపాడిందని తెలిపారు.ఇప్పుడు కూడా ములాయం కొడుకు అఖిలేష్ యాదవ్ మే-23న మాయావతిని వదిలేస్తాడని..అప్పుడు బీజేపీ ఆమెకు మద్దతిస్తుందని అన్నారు.
Read Also : ప్రధాని కార్యాలయంలోనే ఉండగానే భారీ అగ్నిప్రమాదం

మాయావతి కష్టాల్లో ఉన్న ప్రతిసారి బీజేపీ ఆమెకు మద్దతిచ్చిందని,అదేవిధంగా భవిష్యత్తులో కూడా మద్దతిస్తుందని మౌర్య అన్నారు.ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ పరిస్థితి మరితం అద్వాణంగా ఉంటుందని తెలిపారు.ఈ ఎన్నికల్లో యూపీలో బీజేపీ 74 సీట్లు వస్తాయని..కేంద్రంలో మరోసారి నరేంద్రమోడీ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటవుతుందని మౌర్య తెలిపారు.

17వ లోక్ సభకు ఏప్రిల్-11,2019 నుంచి మే-19,2019వరకు ఏడు దశల్లో ఎన్నికలు జరుగనున్నాయి. మే-23,2019న ఫలితాలు వెలువడనున్నాయి. లోక్ సభ ఎన్నికలతో పాటుగా ఆంధ్రప్రదేశ్, ఒడిషా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి.
Read Also : BJP హామీలు : రైతులకు క్రెడిట్ కార్డులు, పెన్షన్లు, రూ.6వేల సాయం