Bengal: మొమిన్‌పూర్ అల్లర్ల వెనక అల్ ఖైదా, ఐసిస్.. సువేందు అధికారి ఆరోపణలు

మొమిన్‌పూర్ హింసకు సంబంధించి ఆ లేఖలో బీజేపీ మూడు డిమాండ్లు ఉంచింది. సీఆర్పీఎఫ్ సిబ్బందిని తక్షణమే మోహరించాలని, బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిహారం చెల్లించాలని ఆ లేఖలో డిమాండ్ చేసినట్టు సువేందు అధికారి పేర్కొన్నారు. మారణహోమానికి సంబంధించిన వీడియో ఫుటేజీని చూసి దోషులను అరెస్ట్ చేసి అసాంఘిక కార్యకలాపాల చట్టం కింద తగిన విధంగా శిక్షించాలన్నది తమ మూడో డిమాండ్ అని పేర్కొన్నారు.

Bengal: మొమిన్‌పూర్ అల్లర్ల వెనక అల్ ఖైదా, ఐసిస్.. సువేందు అధికారి ఆరోపణలు

Al Qaeda, Isis behind Mominpur violence says Suvendu Adhikari

Bengal: కోల్‌కతాలోని మోమిన్‌పూర్‌‭లో ఆదివారం జరిగిన అల్లర్ల వెనక అల్ ఖైదా, ఐసిస్ హస్తం ఉందని బెంగాల్ అసెంబ్లీ ప్రతిపక్ష నేత సువేందు అధికారి ఆరోపించారు. ఈ హింసాత్మక ఘటన నేపథ్యంలో 5 వేల మంది హిందువులు కోల్‌కతాను విడిచిపెట్టి వెళ్లిపోయారని ఆయన ఆరోపించారు. ఈ విషయమై ఆయన సోమవారం బెంగాల్ గవర్నర్, హోం మంత్రికి లేఖ రాశారు. ఈ హింసాత్మక ఘటన వెనక అల్ ఖైదా, ఐసిసి ఉన్నట్టు సువేందు అధికారి ఆ లేఖలో ఆరోపించారు.

‘‘బీజేపీ నేతలు ఆ ప్రాంతంలోకి వెళ్లకుండా మీరు అడ్డుకున్నారు. ఇంటర్నెట్‌పై ఆంక్షలు విధించారు. మీరు మా రాష్ట్ర అధ్యక్షుడిని అరెస్ట్ చేశారు. ముఖ్యమంత్రిగా మీరు ఎవరిని ఎన్నుకున్నారో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. వారు గృహాలను ధ్వంసం చేశారు. ధ్వంసం చేశారు. బెంగాలీ హిందువులు వలస వెళ్లాలని మేం కోరుకోవడం లేదు’’ అని ఆయన పేర్కొన్నారు.

మొమిన్‌పూర్ హింసకు సంబంధించి ఆ లేఖలో బీజేపీ మూడు డిమాండ్లు ఉంచింది. సీఆర్పీఎఫ్ సిబ్బందిని తక్షణమే మోహరించాలని, బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిహారం చెల్లించాలని ఆ లేఖలో డిమాండ్ చేసినట్టు సువేందు అధికారి పేర్కొన్నారు. మారణహోమానికి సంబంధించిన వీడియో ఫుటేజీని చూసి దోషులను అరెస్ట్ చేసి అసాంఘిక కార్యకలాపాల చట్టం కింద తగిన విధంగా శిక్షించాలన్నది తమ మూడో డిమాండ్ అని పేర్కొన్నారు.

Haryana: ఇంటికో బైక్, రూ.20కే లీటర్ పెట్రోల్, మూడు ఎయిర్‭పోర్టులు.. సర్పంచ్ ఎన్నికల్లో ఓ లీడర్ హామీలు