గోవా ఇదేంటీ : బీచుల్లో మందు కొట్టకూడదంట

  • Published By: veegamteam ,Published On : January 25, 2019 / 07:19 AM IST
గోవా ఇదేంటీ : బీచుల్లో మందు కొట్టకూడదంట

పనాజీ :  ఇకపై బీచ్ లలో మద్యం తాగితే జేబుకు చిల్లు పడిపోవటం ఖాయం అంటు థమ్కీ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. బీచ్‌లో మద్యం తాగినా..వంటలు చేసినా..రూ.2వేలు ఫైన్ వేయాలని గోవా ప్రభుత్వం ఆదేశించింది. గోవాలో కాలుష్యాన్ని నివారించేందుకు రాష్ట్ర కేబినెట్ మీటింగ్ నిర్ణయించిదని పర్యాటక శాఖ మంత్రి అజ్ గోంకర్ తెలిపారు. ఒకవేళ నిందితుడు ఫైన్ కట్టకుంటే మూడు నెలల జైలు శిక్ష విధిస్తామని మంత్రి పేర్కొన్నారు. గోవా బీచ్ లలో బహిరంగంగా మద్యం తాగడాన్ని నిరోధిస్తామని ఇచ్చిన హామీ మేర ఈ నిర్ణయం తీసుకున్నామని గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ చెప్పారు. బీచ్ లు, ఫుట్‌పాత్ లపై మద్యం తాగడం, బాటిళ్లు పగులగొట్టడం, దుస్తులు లేకుండా బీచ్ లో పరుగులు తీయడం లాంటి పనులు నిషేధించాలని కొందరు శాసనసభ్యులు సూచించారు. 

చికాకులతో కాస్త ఆటవిడుపు కోరుకునేవారంతా వెళ్లాలనుకు ప్రదేశం గోవా. ముఖ్యంగా రిలాక్స్ కోసం వచ్చేవారు అక్కడ దొరికే వివిధ రకాల లిక్కర్ ను ఆస్వాదించేందుకే ఎక్కువగా వస్తుంటారు. కేవలం భారతీయులనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షించడం గోవా ప్రత్యేకత. కేవలం భారతీయులనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షించడం గోవా ఆదాయం ప్రధానంగా టూరిజంపైనే ఆధారపడి వుంది. 

వివిధ ప్రదేశాల నుండి గోవాకు వచ్చేవారు వంటసామగ్రిని కూడా తెచ్చుకుంటారు. అక్కడ దొరికి రకరకాల చేపలు, రొయ్యలు వంటి సీ ఫుడ్ ను కొనుక్కుని  బీచ్ లలోనే వంట చేసుకుని తింటారు. అంతేకాదు..గోవాలో ఎన్నో రకాల వైన్స్ అందుబాటులో వుంటాయి. వాటిని తాగుతు..రకరకాల నాన్ వెజ్ వంటకాలను ఆస్వాదిస్తు బీచ్ లలో ఎంజాయ్ చేయటం అక్కడ సర్వ సాధారణం. ఈ క్రమంలో గోవా ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ పేరుతో తీసుకున్న నిర్ణయం గోవా టూరిజంపై తీవ్రంగా పడే అవకాశముంది. అదే బీచ్ లలో మందుతాగటం..వంటలు చేయటాన్ని బ్యాన్ చేసింది. అలా చేస్తే జరిమానా..జైలుశిక్ష విధిస్తామంటు ఆదేశాలు జారీచేసింది.  మరి ఈ ప్రభావం గోవా టూరిజంపై ఆపై గోవా ఆదాయంపై తీవ్రంగా పడే అవకాశముంది.