గొంతులో వైరస్ పోవడానికి లిక్కర్ షాపులు ఓపెన్ చేయాలంటోన్న ఎమ్మెల్యే

  • Published By: Subhan ,Published On : May 1, 2020 / 09:40 AM IST
గొంతులో వైరస్ పోవడానికి లిక్కర్ షాపులు ఓపెన్ చేయాలంటోన్న ఎమ్మెల్యే

లిక్కర్ షాపులు ఓపెన్ చేయాలని ముఖ్యమంత్రికే లేఖ రాశారు ఎమ్మెల్యే. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కు వింత రిక్వెస్ట్ అందింది. అది కూడా లిక్కర్ షాపులు ఓపెన్ చేయాలంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే లేఖ ద్వారా విన్నపాన్ని అందజేశాడు. సంగోడ్ నియోజకవర్గానికి చెందిన భరత్ సింగ్ కుందన్‌పూర్ అనే ఎమ్మెల్యేే గొంతులో నుంచి ఉన్న వైరస్ ను ఆల్కహాల్ తొలగిస్తుందని అందుకే వైన్ షాపులు త్వరగా ఓపెన్ చేయాలంటూ లెటర్ రాశాను. 

‘ఆల్కహాల్ తో చేతులు కడుక్కొంటున్నప్పుడు గొంతులోకి వెళ్తే కూడా ఆల్కహాల్ వైరస్ ను వేరుచేస్తుంది’ అని ముఖ్యమంత్రి లేఖను చదివి వినిపించారు. లిక్కర్ షాపులు మూసేయడం వల్లే చట్ట విరుద్ధమైన పనులు జరుగుతున్నాయని, రాష్ట్ర వ్యాప్తంగా బ్లాక్ మార్కెట్ పెరిగిపోతున్నాయి. షాపులు రీపెన్ చేయడం ద్వారా కల్తీ మద్యం తాగి చనిపోయేవారిని కాపాడటమే కాక ఎకానమీని కూడా త్వరగా సంపాదించుకోవచ్చు. 

ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేకు సీపీఐ-ఎమ్ ఎమ్మెల్యే బల్వాన్ సింగ్ పూనియా కూడా సపోర్ట్ చేశారు. అంతకంటే ముందు పూనియా లిక్కర్ షాపులు మూసేసి ప్రజల ఆరోగ్యాలతో ఆడుకుంటున్నారని ఆరోపించారు. రాజస్థాన్లో శుక్రవారం మూడు కరోనా మృతులు నమోదయ్యాయి. 33కేసులు తాజాగా నమోదైనట్లు సమాచారం. అదనపు ముఖ్య కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ మాట్లాడుతూ.. జైపూర్ నుంచి ఇద్దరు, నాగౌర్ నుంచి ఒకరు చనిపోయినట్లు వెల్లడించారు. 

దీంతో రాజస్థాన్ లో ఇప్పటికే కరోనా మృతులు 61కి చేరాయి. జైపూర్ మాత్రమే 34మృతులు ఉండగా, అజ్మీర్ లో 11, చిట్టోర్‌ఘడ్, కోటాలో ఆరు చొప్పున, జోధ్ పూర్, రాజసమంద్ లో ఒక్కొక్కటి నమోదయ్యాయని ఆరోగ్య శాఖ అధికారి చెప్పారు. రాష్ట్రం మొత్తంలో 2వేల 617కేసులు నమోదయ్యాయని 644మంది డిశ్చార్జ్ అయినట్లు అధికారులు తెలిపారు. ఒక వెయ్యి 656మంది ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు.