అలర్ట్ : కొత్త సంవత్సరంలో తేదీతో జాగ్రత్త

  • Edited By: chvmurthy , December 27, 2019 / 10:54 AM IST
అలర్ట్ : కొత్త సంవత్సరంలో తేదీతో జాగ్రత్త

త్వరలో రాబోయే కొత్త సంవత్సరం లో తేదీ వేసేటప్పుడు జాగ్రత్తలు వహించాలని నిపుణులు సూచిస్తున్నారు. కొత్త సంవత్సరం తేదీ కొన్ని చిక్కులు తెచ్చిపెట్టే అవకాశం ఉంది. చెక్కులు, డాక్యుమెంట్లు రాసేటప్పుడు జాగ్రత్తగా ఉండకపోతే పరిస్ధితి తారుమారయ్యే అవకాశం ఉంది.  

మోసగాళ్ళు, అవకాశవాదులు పట్ల అప్రమత్తంగా ఉండాలి. సాధారణంగా తేదీ రాసేటప్పుడు 22/04/19 అని రాస్తుంటాం. కానీ 2020 సంవత్సరంలో ఇలా కుదరదు. 22/04/20 అని రాస్తే ప్రమాదం ముంచుకు వస్తుంది. సంవత్సరం తర్వాత 20 అని రాసి వదిలేస్తే దాని పక్కన మోసగాళ్లు 18  వేస్తే 2018 అవుతుంది. 19 వేస్తే 2019 అవుతుంది. తద్వారా మోసాలు జరగవచ్చు. కనుక డాక్యుమెంట్లు రాసుకునేటప్పుడు, చెక్ ల పైన తేదీలు వేసేటప్పుడు పూర్తిగా సంవత్సరం వేయటం మరిచిపోకండి. కాస్త జాగ్రత్తగా ఉండండి.