Aligarh Hooch Tragedy : కల్తీ మద్యం కాటు.. 55కు పెరిగిన మృతుల సంఖ్య

ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్ జిల్లాలో కల్తీ మద్యం తాగిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఆదివారం(మే 20,2021) నాటికి 55 మంది చనిపోయారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో మరో 17మంది పరిస్థితి విషమంగా ఉంది. బాధితులు జేఎన్‌ మెడికల్ కాలేజీ, అలీగఢ్ జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Aligarh Hooch Tragedy : కల్తీ మద్యం కాటు.. 55కు పెరిగిన మృతుల సంఖ్య

Aligarh Hooch Tragedy

Aligarh Hooch Tragedy : ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్ జిల్లాలో కల్తీ మద్యం తాగిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఆదివారం(మే 20,2021) నాటికి 55 మంది చనిపోయారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో మరో 17మంది పరిస్థితి విషమంగా ఉంది. బాధితులు జేఎన్‌ మెడికల్ కాలేజీ, అలీగఢ్ జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

కాగా, మృతుల సంఖ్యను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించ లేదు. ఈ ఘటనలో 25 మందే చనిపోయారని జిల్లా మెజిస్ట్రేట్‌ చంద్రభూషణ్‌ సింగ్‌ శనివారం(మే 29,2021) నిర్ధారించారు. అలీగఢ్‌ ఎంపీ చెప్పిన మృతుల సంఖ్యకు, కలెక్టర్‌ వెల్లడించిన లెక్కలకు పొంతన లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఇప్పటివరకు 51 మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించామని జిల్లా ప్రధాన వైద్యాధికారి ఆదివారం చెప్పారు. ఇందులో 25 మంది కల్తీ మద్యం కారణంగానే మరణించినట్లు తేలిందన్నారు. మరో 26 మృతదేహాల నుంచి నమూనాలు సేకరించామని.. వాటిని పరీక్షల కోసం ఆగ్రాకు పంపించినట్లు తెలిపారు.

అలీగఢ్‌లోని కార్సియాలోని ఒకే యజమానికి చెందిన రెండు దుకాణాల నుంచి మద్యాన్ని కొనుగోలు చేసి సేవించిన తాగిన వారంతా అస్వస్థతకు గురికావడం కలకలం రేపింది. గురువారం(మే 27,2021) రాత్రి వీరంతా మద్యం సేవించగా.. శుక్రవారం ఉదయం నుంచి ఇప్పటి వరకూ ఈ ఘటనలో 55 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దుకాణంలో మద్యం కొనుగోలు చేసి సేవించిన ఇద్దరు ట్రక్కు డైవర్లు కొద్దిసేపటికే అస్వస్థతకు గురై చనిపోయారు.

వీరు అలీగఢ్-తప్పాల్‌ జాతీయ రహదారి పక్కన గ్యాస్‌ డిపో దగ్గర ట్రక్కు ఆపి మద్యం సేవించారు. కర్సియా, దాని చుట్టు ప్రక్కన గ్రామాలకు చెందిన పలువురు కల్తీ మద్యం సేవించి మృత్యువాత పడ్డారు. ఈ ఘటనలో ఇప్పటివరకు ఐదుగురుని అరెస్ట్ చేయగా.. వీరిలో ఇద్దరు ప్రధాన నిందితులు ఉన్నారు. నిందితులు ప్రభుత్వం నుంచి లైసెన్స్ తీసుకుని మూడు గ్రామాల్లో నాటుసారా దుకాణం నిర్వహిస్తున్నట్టు అధికారులు తెలిపారు. అలాగే, ఈ ఘటనలో జిల్లా ఎక్సైజ్ అధికారి సహా ఐదుగురు ఉద్యోగులను సస్పెండ్ చేశారు. కాంట్రాక్టర్ సహా మరో 12 మందిపై కేసు నమోదు చేశారు.

ఉత్తరాది రాష్ట్రాల్లో మద్యం కల్తీ ఘటనలు ఎక్కువగా జరుగుతుంటాయి. మరీ ముఖ్యంగా యూపీలో ఇలాంటి ఘటనలు తరుచూ చోటుచేసుకుంటున్నాయి. ఈ ఏడాది జనవరిలోనూ బులంద్‌షహర్ జిల్లాల్లో కల్తీ మద్యం తాగి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. నాలుగు రోజుల కిందట హథ్రాస్ జిల్లాల్లో 85 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు.. 1,700 లీటర్ల అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆపరేషన్ ప్రహార్‌లో భాగంగా ఈ చర్యలు చేపట్టారు.