Cemeteries Full : పాత సమాధులు తవ్వి..ఆ గోతుల్లో కరోనా మృతదేహాలు ఖననం : ఎముకలతో భీతావహంగా అలిఘడ్ శ్మశానం

కరోనాతో చనిపోయినవారిని ఖననం చేయటానికి కూడా స్థలం లేనంతగా మారిపోయింది దుస్థితి. దీంతో అలిఘడ్ లోని శ్మశానవాటికలో పాత సమాధుల్ని తవ్వి ఆ స్థానంలో కరోనాతోశవాలను ఖననం చేస్తున్న పరిస్థితి నెలకొంది. దీంతో శ్మశనవాటిక అంతా పాత సమాధుల నుంచి తవ్విన ఎముకలు..అస్థిపంజరాలతో బీతావహంగా మారింది.

Cemeteries Full : పాత సమాధులు తవ్వి..ఆ గోతుల్లో కరోనా మృతదేహాలు ఖననం : ఎముకలతో భీతావహంగా అలిఘడ్ శ్మశానం

Cemeteries Full

Cemeteries Full : దేశ వ్యాప్తంగా కరోనా మృత్యు ఘంటికలు మోగిస్తోంది. ఊపిరి ఆడక మనుషుల ప్రాణాలు పిట్టల్లా రాలిపోతున్నాయి. దేశంలో ఆ రాష్ట్రం. ఈ రాష్ట్రం అనేది లేదు. అన్ని రాష్ట్రాల్లోని కరోనా మరణాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ అలీఘడ్ ముస్లిమ్ విద్యాలయంలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. అలీఘడ్ ముస్లిమ్ విద్యాలయం(ఏఎంయూ)లో గత కొన్ని వారాల్లో కరోనా వైరస్ తో 35 మంది ప్రొఫెసర్లు మరణించారు అంటే అక్కడ కరోనా ఏ రేంజ్ లో ఉందో ఊహించుకోవచ్చు.

కరోనా మృతదేహాలను ఖననం చేయటానికి అలీఘడ్ శ్మశానవాటికలో ఖాళీయే లేకపోయింది. అంతగా ఉన్నాయి అక్కడ మరణాలు.దీంతో శ్మశానంలో ఉన్న పాత సమాధులను తవ్వి ఆ గోతుల్లో కరోనాతో చనిపోయినవారిని పూడ్చి పెట్టాల్సి వస్తున్న దుస్థితి నెలకొంది. ఈ క్రమంలో పాత సమాధులల్లో ఎముకలు, అస్థి పంజరాలు బయటపడుతున్నాయి. ఇటువంటి దారుణ పరిస్థితులను ఎప్పుడూ చూడలేదని..ఈకరోనా కాలంలో ఇటువంటి దారుణాలు చూడాల్సి వస్తోందని స్థానికులు వాపోతున్నారు. గత వారంలో ఏఎంయూలో సీనియర్ ప్రొఫెసర్లు కరోనాతో మరణించడంతో అలీఘడ్ వర్శిటీలో ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ మరణమృదంగాల్లో భాగంగా గత 20 రోజుల్లో 16 మంది సభ్యులు మరణించారు.

దీని గురించి ప్రొక్టర్ ప్రొఫెసర్ ముహమ్మద్ వసీమ్ అలీ మాట్లాడుతూ..ఫార్మసీ డిపార్టమెంట్ ఛైర్మన్, లా ఫ్యాకల్టీ డీన్ వంటివారిని కోల్పోయామని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ పరిస్థితుల్లో వర్శిటీ క్యాంపస్ లో భయం నెలకొదని తెలిపారు. వర్శిటీలో కరోనా మరణాలపై Genetic sequence ద్వారా అధ్యయనం చేయాలని వైస్ ఛాన్సలర్ తారిక్ మన్సూర్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ కు లేఖ రాశారు. కగా..అలీఘడ్ జిల్లాలో 19,179 కరోనా కేసులు నమోదు కాగా మరణాల రేటు గణనీయంగా పెరిగింది. కరోనా మరణాలతో యూనివర్శిటీలో కొవిడ్ టీకా కేంద్రాన్ని ఏర్పాటు చేయించారు.