K S Eshwarappa: మసీదులుగా మార్చిన మొత్తం 36 వేల దేవాలయాలను తిరిగి స్వాధీనం చేసుకుంటాం: కర్ణాటక మాజీ మంత్రి

మసీదులు ఎక్కడైనా నిర్మించుకోండి, ప్రార్ధనలు ఎక్కడైనా చేసుకోండి.. కానీ దేవాలయాలను కూల్చివేసి నిర్మించిన మసీదులను మాత్రం తిరిగి స్వాధీనం చేసుకుంటామని..అదికూడా పూర్తి న్యాయ బద్ధంగా జరుగుతుందని ఈశ్వరప్ప అన్నారు

K S Eshwarappa: మసీదులుగా మార్చిన మొత్తం 36 వేల దేవాలయాలను తిరిగి స్వాధీనం చేసుకుంటాం: కర్ణాటక మాజీ మంత్రి

Majid

K S Eshwarappa: కర్ణాటక మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత.. కే.ఎస్ ఈశ్వరప్ప సంచలన వ్యాఖ్యలు చేశారు. దేవాలయాలను కూల్చివేసి..వాటి స్థానంలో నిర్మించిన మొత్తం మసీదుల ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకుని తీరుతామని ఈశ్వరప్ప సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే కర్ణాటక రాష్ట్రంలో నెలకొన్న మందిర్ – మసీద్ వివాదాలకు..ఈశ్వరప్ప వ్యాఖ్యలు మరింత ఆజ్యం పోసినట్టయింది. శుక్రవారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి ఈశ్వరప్ప ఈ వ్యాఖ్యలు చేశారు. 36 వేల దేవాలయాలను ధ్వంసం చేసి..వాటి స్థానంలో మసీదులు నిర్మించారని..మసీదులు ఎక్కడైనా నిర్మించుకోండి, ప్రార్ధనలు ఎక్కడైనా చేసుకోండి.. కానీ దేవాలయాలను కూల్చివేసి నిర్మించిన మసీదులను మాత్రం తిరిగి స్వాధీనం చేసుకుంటామని..అదికూడా పూర్తి న్యాయ బద్ధంగా జరుగుతుందని ఈశ్వరప్ప అన్నారు. కాగా, ఇటీవల దక్షిణ కర్ణాటకలోని పలు జిల్లాలు, ప్రధానంగా మంగళూరు నగర శివరుల్లో కొన్ని మసీదుల్లో పురాతన ఆలయ శిధిలాలు బయటపడ్డాయి. ఈక్రమంలో ఆయా మసీదుల నిర్మాణాలపై పూర్తి విచారణ జరిపించాలని విశ్వహిందూ పరిషద్ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

Other Stories: Delhi riots: ఇంటికొచ్చిన ఢిల్లీ అల్లర్ల కేసు నిందితుడు.. స్థానికుల ఘన స్వాగతం

మరోవైపు వారణాసిలోనూ..సంచలనం కలిగించిన జ్ఞానవాపి మసీదు ప్రాంగణ సర్వేలో విచారణ కొనసాగుతూనే ఉంది. మందిర్-మసీదు వివాదం తెలంగాణకు కూడా చేరుకుంది. రాష్ట్రంలోని అనేక దేవాలయాలను కూల్చివేసి, వాటిపై మసీదులు నిర్మించారని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. మసీదులను ఇప్పుడు తవ్వితే శివలింగాలు బయటపడే అవకాశం ఉందని కూడా బండి సంజయ్ పేర్కొన్నారు. బుధవారం జరిగిన ఓ సమావేశంలో బండి సంజయ్ మాట్లాడుతూ తెలంగాణలోని మసీదులన్నీ తవ్వి చూద్దాం, అస్థిపంజరాలు కనిపిస్తే, మసీదులను వారికి వదిలివేస్తాము. శివలింగాలు కనిపిస్తే వాటిని స్వాధీనం చేసుకుంటామని ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీకి సవాలు విసిరారు బండి సంజయ్. రామ్‌సేన అధినేత ప్రమోద్‌ ముతాలిక్‌ మాట్లాడుతూ.. శాంతిభద్రతలు కాపాడాలంటే ముస్లింలు ధ్వంసం చేసి మసీదులుగా మార్చిన ఆలయాలను తిరిగి హిందువులకు అప్పగించాల్సిందేనని అన్నారు.