PM Modi: తుమకూరులో ఆసియాలోనే అతిపెద్ద హెలికాప్టర్ల తయారీ కేంద్రం.. సోమవారం ప్రారంభించనున్న మోదీ

‘ఆత్మనిర్భర్ భారత్’ ద్వారా దేశంలోనే సొంతంగా ఆయుధాలు, హెలికాప్టర్ల వంటివి తయారు చేయాలని కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా హెచ్ఏఎల్ సంస్థ హెలికాప్టర్ల తయారీ కేంద్రాన్ని ప్రారంభించబోతుంది. ఈ ఫ్యాక్టరీని ప్రధాని మోదీ జాతికి అంకితం చేయనున్నారు.

PM Modi: తుమకూరులో ఆసియాలోనే అతిపెద్ద హెలికాప్టర్ల తయారీ కేంద్రం.. సోమవారం ప్రారంభించనున్న మోదీ

PM Modi: ఆసియాలోనే అతిపెద్దదైన హెలికాప్టర్ల తయారీ కేంద్రం కర్ణాటకలోని తుమకూరులో ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 6, సోమవారం నాడు ప్రధాని మోదీ ఈ తయారీ కేంద్రాన్ని ప్రారంభిస్తారు. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) సంస్థ ఈ తయారీ కేంద్రాన్ని నిర్మించింది.

Edgardo Greco: పిజ్జా చెఫ్‌గా పని చేస్తున్న మాఫియా డాన్.. 16 ఏళ్లకు పట్టుబడ్డ నిందితుడు

‘ఆత్మనిర్భర్ భారత్’ ద్వారా దేశంలోనే సొంతంగా ఆయుధాలు, హెలికాప్టర్ల వంటివి తయారు చేయాలని కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా హెచ్ఏఎల్ సంస్థ హెలికాప్టర్ల తయారీ కేంద్రాన్ని ప్రారంభించబోతుంది. ఈ ఫ్యాక్టరీని ప్రధాని మోదీ జాతికి అంకితం చేయనున్నారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. తుమకూరులోని ఈ తయారీ కేంద్రం 615 ఎకరాల్లో ఏర్పాటు కానుంది. హెలికాప్టర్లకు సంబంధించిన అన్ని రకాల ఉత్పత్తులు ఇక్కడ తయారవుతాయి. మొదట్లో ఇక్కడ తేలికపాటి హెలికాప్టర్లను మాత్రమే తయారు చేయాలనుకున్నారు. ఇవి మూడు టన్నుల బరువు మాత్రమే ఉంటాయి.

CM Kejriwal: కేజ్రీవాల్ కార్యాలయం ఎదుట బీజేపీ నిరసన.. లిక్కర్ స్కాం నేపథ్యంలో సీఎం రాజీనామాకు డిమాండ్

అయితే, తర్వాత ఇక్కడ లైట్ కంబాట్ హెలికాప్టర్స్ (ఎల్‌సీహెచ్ఎస్), ఇండియన్ మల్టీరోల్ హెలికాప్టర్స్ వంటివి కూడా తయారు చేయాలని నిర్ణయించారు. ఇక్కడ హెలికాప్టర్ మెయింటెనెన్స్, రిపేర్ వంటి సేవలు కూడా అందిస్తారు. తాజాగా ఇక్కడ 3-15 టన్నుల బరువు కలిగిన హెలికాప్టర్లను కూడా తయారు చేయాలని నిర్ణయించారు. రాబోయే 20 ఏళ్లలో వెయ్యి హెలికాప్టర్లను తయారు చేసేందుకు హెచ్ఏఎల్ ప్రణాళికలు రూపొందించింది. దీని ద్వారా దాదాపు రూ.4 లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి దొరుకుతుంది.