Vaccination New Policy: కొత్త వ్యాక్సినేషన్ పాలసీ.. నేటి నుంచి అమల్లోకి!

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కొత్త కరోనా పాలసీ నేటి నుంచి అమల్లోకి రానుంది. ఈ పాలసీలో భాగంగా దేశంలో 18 ఏళ్లు నిండిన అందరికీ కేంద్ర ప్రభుత్వమే ఉచితంగా వ్యాక్సిన్‌లు వేయనుంది. దీనికోసం దేశంలో తయారయ్యే వ్యాక్సిన్లలో 75 శాతం వ్యాక్సిన్‌ డోసులు సేకరిస్తున్నారు.

Vaccination New Policy: కొత్త వ్యాక్సినేషన్ పాలసీ.. నేటి నుంచి అమల్లోకి!

Vaccination New Policy

Vaccination New Policy: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కొత్త కరోనా పాలసీ నేటి నుంచి అమల్లోకి రానుంది. ఈ పాలసీలో భాగంగా దేశంలో 18 ఏళ్లు నిండిన అందరికీ కేంద్ర ప్రభుత్వమే ఉచితంగా వ్యాక్సిన్‌లు వేయనుంది. దీనికోసం దేశంలో తయారయ్యే వ్యాక్సిన్లలో 75 శాతం వ్యాక్సిన్‌ డోసులు సేకరిస్తున్నారు. మరో 25 శాతం వ్యాక్సిన్‌లు ప్రైవేట్‌ ఆసుపత్రులకు ఇవ్వనున్నారు.

దేశవ్యాప్తంగా 18 ఏళ్లు నిండిన ప్రజలందరికీ ప్రభుత్వ వ్యాక్సినేషన్ కేంద్రాల ద్వారా ఉచితంగా వ్యాక్సిన్ వేయనున్నాయి. గతంలో 18 నుంచి 44 ఏళ్ల మ‌ధ్య వారు వ్యాక్సిన్‌కు డ‌బ్బు చెల్లించాల్సిందేన‌ని చెప్పగా.. తెలంగాణ స‌హా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆ ఖ‌ర్చు తాము భ‌రిస్తామ‌ని ప్రకటించాయి. ఈ వ్యాక్సినేషన్‌ విధానంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తడంతో.. సుప్రీం కోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో దిగొచ్చిన కేంద్రం కొత్త వ్యాక్సినేషన్‌ విధానాన్ని ప్రకటించింది.

కొత్త వ్యాక్సినేషన్‌ విధానంలో భాగంగా దేశంలో తయారయ్యే వ్యాక్సిన్లలో 75శాతం వ్యాక్సిన్ డోసులను సేకరించనున్నారు. అటు వ్యాక్సిన్ ఉత్పత్తి సంస్థలు ఒక నెలలో ఉత్పత్తి చేసే వ్యాక్సిన్ డోసుల్లో ప్రైవేట్ ఆసుపత్రులు 25 శాతం మాత్రమే ప్రైవేట్‌ ఆస్పత్రులకు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వ్యాక్సిన్‌ డోసులు అమ్మేందుకు నేషనల్‌ హెల్త్‌ అథారిటీకి చెందిన ఎలక్ట్రానిక్‌ ఫ్లాట్‌ఫామ్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఈ అథారిటీ ద్వారా ఆసుపత్రులు వ్యాక్సిన్‌ ఉత్పత్తి సంస్థలకు ప్రైవేట్‌ ఆసుపత్రులు చెల్లింపులు చేస్తాయి. అలాగే శివారు ప్రాంతాల్లో ఉన్న ఆసుపత్రులకు కూడా వ్యాక్సిన్‌లు చేరేలా ప్రభుత్వాలు ఏర్పాట్లు చేస్తున్నాయి.

హెల్త్‌ కేర్‌ వర్కర్లు, ఫ్రంట్‌ లైన్‌ వారియర్లు, 45 ఏళ్లు దాటిన వాళ్లు, రెండో డోసు పెండింగ్‌లో ఉన్న వాళ్లతో పాటు 18 ఏళ్లు నిండిన వారికి ప్రాధాన్యత క్రమంలో వ్యాక్సిన్లు రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వనున్నాయి. రాష్ట్రాల జనాభా, కరోనా వ్యాప్తి, ఇప్పటివరకు జరిగిన వ్యాక్సినేషన్‌, వృథా అయిన వ్యాక్సిన్లు ఇలా అన్నింటినీ లెక్కలోకి తీసుకుని వ్యాక్సిన్‌ డోసులను కేటాయించనుంది కేంద్ర ప్రభుత్వం.

కేంద్రం ఇచ్చే వ్యాక్సిన్‌ డోసులకు అనుగుణంగా ఆయా రాష్ట్రాల్లోని జిల్లాలకు ముందుగానే సమాచారం ఇవ్వనున్నారు. అటు ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో వ్యాక్సిన్‌ డోస్‌ ధరను తయారీ సంస్థలు నిర్ణయించనున్నాయి. సర్వీస్‌ ఛార్జీల కింద డోసుకు 150 రూపాయలకు మించి తీసుకోవద్దని ఇప్పటికే కేంద్రం స్పష్టం చేసింది.