Corona Deaths : కరోనా మరణాలు లెక్క సరిగా చెప్పకపోతే కఠిన చర్యలు..

కరోనా సోకి ఎక్కడ చనిపోయినా అది కరోనా మరణంగానే పరిగణించాలని కేంద్రం ప్రభుత్వం స్పష్టంచేసింది. దీనికి సంబంధించి కేంద్రం సుప్రీంకోర్టుకు 183 పేజీల అఫిడవిట్ సమర్పించింది. ఈక్రమంలో కరోనా మరణాలు లెక్క సరిగా చెప్పకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్రం ఆయా రాష్ట్రాల డాక్టర్లను హెచ్చరించింది.

Corona Deaths : కరోనా మరణాలు లెక్క సరిగా చెప్పకపోతే కఠిన చర్యలు..

All Corona Deaths To Be Certified

All Corona Deaths To Be Certified : దేశ వ్యాప్తంగా కరోనా మరణాల మరణమృదగం కాస్త నెమ్మదించింది. మరణాల సంఖ్య తగ్గుతోంది. కానీ కొన్ని వారాల క్రితం దేశంలో ఏరాష్ట్రంలో విన్నా కరోనా మరణాలే. ఆసుపత్రుల్లోనే కాదు..బెడ్లు దొరక ఆసుపత్రి పార్కింగ్ లోనే..ఆ చుట్టుపక్కల వీధుల్లోను..ఇళ్లల్లోను..వాహనాల్లోను ఇలా ఎక్కడ చూసినా..ఎక్కడ విన్నా కరోనాతో మరణాల వార్తలే. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోను ఇదే పరిస్థితి.కానీ కరోనా మరణాల లెక్కలు అధికారికంగా చెప్పటంలో కొన్ని రాష్ట్రాలు తప్పుడు లెక్కలు చెబుతున్నాయి. ఈక్రమంలో కరోనా మరణాలు లెక్క సరిగా చెప్పకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్రం ఆయా రాష్ట్రాల డాక్టర్లను హెచ్చరించింది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో 183 పేజీల అఫిడవిట్ దాఖలు చేసింది.

ఈ అఫిడవిట్ లో నే కరోనా మరణాల విషయంలో అన్ని రాష్ట్రాలు సరైన సమాచారం కేంద్రానికి అందించాలని..ఆసుపత్రుల్లోనే కాదు ఎక్కడ చనిపోయినా కరోనా మరణాలుగానే పరిగణించాలని తేల్చి చెప్పింది. ఆసుపత్రుల్లో లెక్కలు మాత్రమే కాదని కరోనా సోకి ఆసుపత్రుల్లోను..పార్కింగ్ లోను..ఇళ్లల్లోను ఇలా ఎక్కడైనా సరే కరోనాతో చనిపోతే అది కరోనా మరణం కింద పరిగణించాలని స్పష్టంచేసింది. కరోనా మరణాలు ఎక్కడ నమోదైనా వాటిని కరోనా మరణాలుగానే పరిగణించాల్సిందేనని..వాటినీ లెక్కలోకి తీసుకోవాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది.

ఆరు రాష్ట్రాల్లో కరోనా మరణాల లెక్కల్లో తేడాలున్నాయన్న మీడియా కథనాలు వెలువరించిన క్రమంలో సుప్రీంకోర్టులో కేంద్రం 183 పేజీల అఫిడవిట్ ను దాఖలు చేసింది. ఈ నిబంధనను ఎవరు అతిక్రమించినా ఆ డాక్టర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఇప్పటిదాకా కేవలం ఆసుపత్రుల్లో మరణించిన వారినే లెక్కలోకి తీసుకుంటున్నారని.. ఇల్లు లేదా ఆసుపత్రి పార్కింగ్ ప్రదేశాల్లో చనిపోతున్న వారిని కరోనా మరణాల కింద పరిగణించట్లేదని పేర్కొంది.పలు మరణాలకు సంబంధించి డెత్ సర్టిఫికెట్లలో ఊపిరితిత్తుల సమస్య లేదా గుండె జబ్బు సమస్యతో చనిపోయారని పేర్కొంటున్నారు. కరోనా బాధితులు చనిపోతే వారికి డెత్ సర్టిఫికెట్లు జారీ చేసే విషయంలో సరైన విధానాలంటూ లేవా? దానికి ఏవైనా మార్గదర్శకాలున్నాయా’’ అంటూ కేంద్రానికి సుప్రీం కోర్టు నోటీసులిచ్చింది. దీనిపైనే కేంద్రం అఫిడవిట్ ను దాఖలు చేసింది.

కాగా..ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీల్లోనే దాదాపు 4.8 లక్షల మరణాలను లెక్కలోకి తీసుకోనట్లుగా తెలుస్తోంది. ఈ ఐదు నెలల్లోనే 75 వేల మరణాలను బీహార్ దాచిపెట్టిందని ప్రభుత్వ గణాంకాల ద్వారా తాజాగా తెలియటంతో ఇటు మహారాష్ట్ర కూడా కరోనా మరణాల లెక్కలను సవరిస్తోంది. ఈ 12 రోజుల్లోనే 8,800 మరణాలను లెక్కల్లో చేర్చింది. అంటే ఆయా రాష్ట్రాలు కరోనా లెక్కలు తెలియజేయటంతో తప్పుడు లెక్కలు ఇస్తున్నట్లుగా తేలింది. దీనిపై సుప్రీంకోర్టు కేంద్రాన్ని ప్రశ్నించగా దానికి సంబంధించి అఫిడవిట్ లో కేంద్రం ఆయా రాష్ట్రాల డాక్టర్లకు హెచ్చరికలు జారీ చేసింది. కరోనా చనిపోతే అది ఎక్కడ చనిపోయినా కరోనా మరణం కిందే పరిగణించాలని తెలిపింది.